BigTV English

Horoscope 14 october 2024: ఈ రాశి వారికి అనుకూలం.. పట్టిందల్లా బంగారమే!

Horoscope 14 october 2024: ఈ రాశి వారికి అనుకూలం.. పట్టిందల్లా బంగారమే!

Astrology 14 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఇతరుల సహకారంతో విజయం పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వరిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. లక్ష్మీదేవి సందర్శనంతో శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం:
ఈ రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారులకు లాభాలే లాభాలు. పట్టిందల్లా బంగారం అవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. ఆధ్యాత్మిక కర్యాక్రమాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.


మిథునం:
మిథునం రాశి వారికి అనుకూలంగా లేదు. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి. కోపం, చిరాకులకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సహనం కోల్పోవద్దు. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు వస్తాయి.

కర్కాటకం:
ఈ రాశి వారికి విజయవంతంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అప్పగించిన పనులు తోటివారి సహకారంతో పూర్తవుతాయి. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అసవరం. శివారాధన శ్రేయస్కరం.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఇతరులతో కలిసి పెండింగ్ పనులు పూర్తవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇతరుల సహకారం తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. శివరాధన చేయడం మంచిది.

Also Read: 30 సంవత్సరాల తర్వాత దీపావళి నాడు శుభ యోగం.. ఈ 4 రాశుల జీవితంలో అన్నీ శుభ దినాలే

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అన్ని రంగాల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అవసరానికి సహాయం అందుతుంది. కోపం, చిరాకులకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వరిస్తాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. ఆంజనేయ దండకం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

వృశ్చికం:
వృశ్చికం రాశి వారికి శుభకరంగా ఉంటుంది. కీలక విషయాల్లో పెద్దల సహకారం తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాలు వరిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, హోదా పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపడుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించాలి.

ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కీలక సమయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. కోపాన్ని దరిచేరనీయవద్దు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పట్టిందల్లా బంగారమే. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

కుంభం:
కుంభరాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. కీలక సమయాల్లో మిత్రుల సహకారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మొండి బాకీలు వసూలు చేస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

మీనం:
మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ప్రయోజనాలు వస్తాయి. ప్రణాళికతో ముందుకు వెళ్తే సక్సెస్ వరిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×