Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 6న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.
మిధున రాశి : ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట నిస్తుంది ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు సన్నిహితులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.
మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?