BigTV English

OTT Movie : ఓనర్ ను కాపాడడానికి ప్రాణాలకు తెగించే పిల్లి… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : ఓనర్ ను కాపాడడానికి ప్రాణాలకు తెగించే పిల్లి… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : కామెడీ జానర్ లో వచ్చిన ఒక హాలీవుడ్ ఫాంటసీ సినిమా, ఆడియన్స్ చేత నవ్వులు పూయిస్తోంది. ఈ చిత్రం ఒక వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. అతని ఆత్మ పిల్లిలోకి ప్రవేశించడంతో కథ ఆసక్తిగా మారుతుంది. $30 మిలియన్ బడ్జెట్‌తో, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $60 మిలియన్లు వసూళ్లు సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తో నడిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Nine Lives’ 2016 లో వచ్చిన అమెరికన్ ఫాంటసీ కామెడీ చిత్రం. దీనికి బారీ సోనెన్‌ఫెల్డ్ దర్శకత్వం వహించారు. ఇందులో కెవిన్ స్పేసీ, జెన్నిఫర్ గార్నర్, రాబీ అమెల్, చెరిల్ హైన్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో ఈ సినిమా 5.3/10 రేటింగ్‌ పొందింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, టూబీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

టామ్ బ్రాండ్ ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త. న్యూయార్క్‌లో ఫైర్‌బ్రాండ్ అనే కంపెనీ సీఈఓ. అతను తన కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. కానీ తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. భార్య లారా, కుమార్తె రెబెక్కా, సవతి కొడుకు డేవిడ్ లకు కనీస సమయం కూడా కేటాయించాడు. రెబెక్కా 11వ పుట్టినరోజుకు, ఆమె కోరుకున్న పిల్లిని బహుమతిగా ఇవ్వాలని టామ్ అనుకుంటాడు. కానీ అతను ఆ సమయానికి బిజీగా ఉండటంతో, ఫెలిక్స్ పర్కిన్స్ అనే వింతైన పెట్ షాప్ యజమాని నడిపే దుకాణంలో ‘మిస్టర్ ఫజీపాంట్స్’ అనే పిల్లిని కొంటాడు. ఆ రోజు టామ్ ఒక బిజినెస్ డీల్ కోసం తన కంపెనీ భవనం పైకి వెళ్తాడు. కానీ ఒక యాక్సిడెంట్‌లో కోమాలోకి వెళ్తాడు. అతని ఆత్మ మిస్టర్ ఫజీపాంట్స్ పిల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయట పడటానికి, పిల్లి రూపంలో ఉన్న అతను ఫెలిక్స్ దగ్గరికి వెళతాడు.


ఫెలిక్స్ అతనికి ఒక మాంత్రికుడిలా అనిపిస్తాడు. టామ్‌కు తన కుటుంబంతో సమయం గడిపి, తన తప్పులను సరిదిద్దుకోవాలని ఫెలిక్స్ చెబుతాడు. లేకపోతే శాశ్వతంగా పిల్లిగా మిగిలిపోతావని హెచ్చరిస్తాడు. పిల్లి శరీరంలో, టామ్ తన కుటుంబాన్ని దగ్గరగా గమనిస్తాడు. వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుంటాడు. రెబెక్కా తన తండ్రి కోసం ఆరాటపడుతుందని, లారా వివాహంలో అసంతృప్తిగా ఉందని, డేవిడ్ కంపెనీలో తన స్థానం కోసం పోరాడుతున్నాడని తెలుస్తుంది. అదే సమయంలో టామ్ కంపెనీ బోర్డు సభ్యుడు ఇయాన్ కాక్స్, కంపెనీని ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర చేస్తున్నాడని తెలుస్తుంది. టామ్ పిల్లిగా, తన కుటుంబానికి సహాయం చేయడానికి, కాక్స్ ప్లాన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. చివరలో టామ్ తన కుటుంబం పట్ల ప్రేమను చూపించడం ద్వారా మళ్లీ మానవుడిగా మారతాడా ? కాక్స్ ప్లాన్‌ను అడ్డుకుంటాడా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Read Also : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా 

Related News

OTT Movie : ఈ ఊళ్ళో నీళ్లలో అడుగుపెడితే పోతారు… తండ్రీకూతుర్లూ ఇద్దరూ ట్రాప్… వణుకు పుట్టించే ట్విస్టులు

OTT Movie : కూతురు వయసున్న అమ్మాయితో… మోహన్ లాల్ ను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు మావా

OTT Movie : హాస్పిటల్ కు వచ్చిన అమ్మాయిల్ని వదలకుండా అదే పని… ఐసీయూలో ముసలి డాక్టర్ అరాచకం భయ్యా

OTT Movie : డ్రాయర్ లో ఫిష్ వేసుకుని ఇదెక్కడి మెంటల్ పనిరా అయ్యా… ఒక్కో సీన్ మ్యాడ్ ఉంటది భయ్యా

OTT Movie : బాబోయ్ అరుపుతో అరసెకనులో చంపేసే అమ్మాయి… ఒక్కొక్కడూ ముక్కలు ముక్కలుగా… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు

OTT Movie : ఇంకొకడి కోసం ప్రేమించిన వాడిని నిండా ముంచే అమ్మాయి… కిల్లర్ల గ్యాంగ్ మొత్తం ఒకే చోట… బ్రూటల్ రివేంజ్ డ్రామా

Big Stories

×