Salman Ali Agha cheque: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఛాంపియన్ గా నిలిచిన టీం ఇండియా మాత్రం…. ఆసియా కప్ 2025 ట్రోఫీని అందుకోలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi )… ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్నారు. రూల్స్ ప్రకారం… ఏసీసీ ఛైర్మన్ చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని అందుకోవాలి. కానీ… యుద్దం జరిగిన నేపథ్యంలో… టీమిండియా ప్లేయర్లు ట్రోఫీని తీసుకోలేదు. ఇక అటు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాత్రం రన్నరప్ చెక్ ను అందుకున్నారు. నఖ్వీ చేతుల మీదుగా రన్నరప్ చెక్ ను అందుకున్నారు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా. అయితే.. ఆ తర్వాత.. ఇచ్చిన చెక్ ను కింద పడేశారు. అందరూ అధికారులు ఉన్నప్పటికీ.. లెక్క చేయకుండా…. నేలకేసికొట్టాడు సల్మాన్ అలీ అఘా. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్… సల్మాన్ అలీ అఘాకు బాగా బలుపు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఛాంపియన్ గా టీమ్ ఇండియా నిలిచినప్పటికీ… ట్రోఫీని మాత్రం అందుకోలేదు. పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ఈ అవార్డు ఇస్తున్న నేపథ్యంలో… రిజెక్ట్ చేశారు టీమిండియా ప్లేయర్లు. అయితే దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India)సెక్రటరీ సైకియా తాజాగా స్పందించారు. ఇండియాతో యుద్ధం చేస్తున్న దేశస్థుడి నుంచి ట్రోఫీని మేము అస్సలు తీసుకోబోము.. అంటూ ఆయన ప్రకటన చేశారు. అందుకే ట్రోఫీతో పాటు మెడల్స్ కూడా నిరాకరించామని క్లారిటీ ఇచ్చారు సైకియా. దాని అర్థం… ఆ ట్రోఫీలను… మొహ్సిన్ నఖ్వీ తన హోటల్ రూమ్ కు తీసుకుపోమనడం కాదన్నారు. అతడికి ఏమాత్రం బుద్ధి ఉన్న త్వరలో ట్రోఫీని ఇండియాకు పంపిస్తాడని వ్యాఖ్యానించారు. అతడి ప్రవర్తనకు వ్యతిరేకంగా స్ట్రాంగ్ ప్రొటెక్ట్ చేస్తామని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ సైకియా ప్రకటన చేశారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు బాగానే బలుపు ఉన్నట్లు తెలుస్తోంది. రన్నరప్ చెక్ ఇచ్చిన తర్వాత… దాన్ని అక్కడే పడేశాడు అలీ. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ఇచ్చిన చెక్ కూడా సల్మాన్ కింద పడేయడం….దారుణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇక అటు… ఆసియా కప్ 2025 ట్రోఫీ అందుకోకుండా… టీమిండియా ప్లేయర్లు అక్కడే సెల్ఫీలు, రీల్స్ చేశారు. బీసీసీఐ అదేశాల ప్రకారం….టీమిండియా ప్లేయర్లు నడుచుకున్నారు.
salman ali agha received and throw away runner-up award. #PakistanCricket #INDvPAK #PakVsInd pic.twitter.com/TgBIh9e5tJ
— Moosa (@ImMoss0) September 28, 2025