Weather Update: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సంవత్సరం వేసవికాలం, వర్షకాలం అనే తేడా లేకుండా కుమ్మేస్తానే ఉంది. ఇప్పుడు చలికాలం కూడా రాబోతుంది.. అయిన వర్షాలు తగ్గుతాయి లేదా అనేది ఇంకా తెలియని సమాచారం.. ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో తెలంగాణకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, ములుగు, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, నారాయణపేట, రంగారెడ్డి, కరీంనగర్, సూర్యపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
నేడు హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో హై అలర్ట్
తెలంగాణ మొత్తం ఒకలా ఉంటే ఇక్కడ మాత్రం ఇంకొలా ఉంటుంది. హైదరాబాద్‌లో వర్షం అంటే ప్రజలు వణికిపోతుంటారు. ఇప్పటికే మూసినది పొంగి ప్రవహిస్తుంది. అక్కడి చూట్టు పక్కల ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాదారులు ట్రాఫిక్ జాం ఏర్పడటంతో ఎన్నో అవస్థలు పడుతున్నారు.. ఆఫీసులకు వెళ్లిన వారు, బయటకు వెళ్లినవారు ఇంటికి త్వరగా చేరుకోలుకపోతున్నారు. రాత్రి నుంచి కొంచెం వాతావరణం ప్రశాంతంగా ఉంది.. కానీ మళ్లీ సాయంత్రం వరకు భారీ వర్షం కురిస్తుందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం..
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. నేడు ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్నూలు, విజయవాడ, కాకినాడ, నెల్లురు, ఒంగొలు, శ్రీకాకుళం, ప్రకాశం, తూర్ప గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున సముద్ర తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తుంది.