Asia Cup Final: ఆపరేషన్ సింధూర్‌తో ఇండియా-పాకిస్థాన్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ వ్యవహారం సద్దుమణిగినా ఇరుదేశాల మధ్య ఆ వేడి కంటిన్యూ అవుతోంది. తాజాగా ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చావు దెబ్బ కొట్టింది టీమిండియా. ఫైనల్‌లో విజయం సాధించిన నుంచి కప్ తీసుకునే వరకు జరిగిన పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా కప్ ఎగురేసుకు పోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత దాయాది దేశం పాక్‌తో టీమిండియా తలపడింది. లీగ దశ నుంచి మొదలు పాక్‌పై టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పనక్కర్లేదు. తొలి మూడు వికెట్లు పడగానే దాయాది దేశం ప్రజల్లో ఆనందాలు వెన్నంటాయి. ఆసియా కప్ తమదేనని సంబరాలు చేసుకున్నారు.
ఈలోగా మైదానంలోకి దిగిన టీమిండియా ఆటగాడు, తెలుగు బిడ్డ తిలక్‌వర్మ పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. తిలక్‌ను ఔట్ చేయడానికి దాయాది ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు వారి వెన్నులో వణుకు పుట్టించాడు తిలక్‌వర్మ. నరాలు తెగే ఉత్కంఠ పోరులో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత్ అభిమానుల్లో ఆనందాలు మిన్నంటాయి. కోట్లాది మంది అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దాయాది దేశంపై విజయం సాధించడంతో సామాన్యుడి మొదలు ప్రధాని వరకు టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు మొదలయ్యాయి.
ALSO READ: పాకిస్థాన్ పై ఆపరేషన్ తిలక్.. తొమ్మిదోసారి టీమిండియా విజేత
టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. కప్ గెలిచినందుకు ఆటగాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఎక్కడైనా ఫలితం ఒక్కటేనని, ఇండియా గెలిచిందని రాసుకొచ్చారు. భారత క్రికెటర్లకు అభినందనలు తెలిపారు.
ప్రధాని మోదీ కామెంట్స్ వెనుక బలమైన కారణం ఉంది. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను పాక్ తీవ్రవాదులు బలిగొన్నారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ వ్యవహరించిన తీరుపై భారత్‌కు అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. దీని ప్రతిగా మే 7 నుంచి 10 వరకు దాయాది దేశంలోని ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత్ సైన్యం.
భారత్ దాడులకు దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అంతేకాదు పాక్‌కు చెందిన పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది కూడా. ఈ ఘటనను ఇంకా భారతీయులను వెంటాడుతున్నాయి. ట్రోర్నీ మొదలు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఆటగాళ్లు.. పాక్ ఆటగాళ్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు కూడా. చివరకు పాక్ మంత్రి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు ముఖం చాటేశారు ఆటగాళ్లు.
టీమిండియా విజయంపై తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు తెలిపారు. ఆసియా కప్ గెలిచిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ చెబుతూ పోస్ట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మైదానంలో కూడా 'ఆపరేషన్ సిందూర్': ప్రధాని మోదీ
టీమిండియా ఆసియా కప్ గెలిచిన శుభ సందర్భంలో ఆసక్తికరంగా ట్వీట్ చేసిన మోదీ
'మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఎక్కడైనా ఫలితం ఒక్కటే.. ఇండియా గెలిచింది.. టీమిండియా క్రికెటర్లకు శుభాకాంక్షలు' అని పేర్కొన్న మోదీ #INDvPAK #indvspak2025… pic.twitter.com/oGd9LTfvru
— BIG TV Breaking News (@bigtvtelugu) September 29, 2025