Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత్ 9వ సారి ఆసియా కప్ టైటిల్ గెలుచుకుంది. అయితే టైటిల్ గెలిచినప్పటికీ టీమిండియా మాత్రం ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. మ్యాచ్ ముగిసిన తరువాత భారత జట్టు పాకిస్తాన్ మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఈ నిర్ణయానికి బలంగా కట్టిపడి ఉండటంతో కొంత సమయం తరువాత కూడా ట్రోఫీని స్వీకరించలేదు.
Also Read : Asia Cup Final: పాక్‌ని చిత్తు చేసిన టీమిండియా, ఎక్కడైనా ఫలితం ఒక్కటే- ప్రధాని మోదీ
దీంతో అక్కడ మరో డ్రామా కూడా నడిచింది. ఇక్కడ పాకిస్తాన్ కి మరోసారి ఘోర అవమానం ఎదురైంది. భారత్ ట్రోఫీ లేకుండానే గెలుపు సంబురాలు చేసుకోవడం విశేషం. పాకిస్తాన్ ప్లేయర్లు రన్నరప్ చెక్, మెడల్స్ తీసుకోగా భారత ఆటగాళ్లు మెడల్స్ కూడా నిరాకరించారు. మరోవైపు టీమిండియా ఆసియా కప్ ట్రోఫీని నిరాకరించడం పై బీసీసీఐ సెక్రెటరీ సైకియా స్పందించారు. “భారత్ తో యుద్ధం చేస్తున్న దేశస్థుడి నుంచి ట్రోఫీని తీసుకోలేం. అందుకే ట్రోఫీ, మెడల్స్ ను నిరాకరించాం. దాని అర్థం వాటిని నఖ్వీ తన హోటల్ గదికి తీసుకెళ్లమని కాదు. అతనికి ఏమాత్రం బుద్ధి ఉన్నా.. త్వరలో ట్రోఫీని భారత్ కి పంపిస్తాడు. అతని ప్రవర్తనకు వ్యతిరేకంగా స్ట్రాంగ్ ప్రొటెస్ట్ చేస్తాం” అని వ్యాఖ్యానించాడు. మరోవైపు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ లేకుండా నడుకుంటూ రోహిత్ శర్మ మాదిరిగా యాక్టింగ్ చేశాడు.
ఇక మ్యాచ్ తరువాత రన్నర్ ఆఫ్ మెడల్స్ అందుకునేందుకు పాకిస్తాన్ ఆటగాళ్లు స్టేజ్ పైకి రాగా.. స్టేడియంలో ఉన్న భారత అభిమానులు అంతా గట్టిగా హూటింగ్ చేసారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాళ్లు మెడల్స్ తీసుకుంటున్నప్పుడు గట్టిగా అరుస్తూ.. వ్యగ్యంగా స్టేడియాన్ని హోరెత్తించారు. ఇది పాకిస్తాన్ జట్టును చాలా ఇబ్బంది పెట్టింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా నిరాశ వ్యక్తం చేస్తూ.. ఈ ఓటమి చాలా బాధకరమని.. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో పేర్కొన్నారు. ట్రోఫీ మాత్రమే కాదు.. భారత ఆటగాళ్లు మెడల్స్ కూడా స్వీకరించలేదు. దీంతో మరోసారి వివాదం తలెత్తింది. ఇక భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో కలిసి ట్రోఫీ ఫొటోషూట్ చేసేందుకు కూడా అంగీకరించలేదు. ఇప్పటివరకు ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ తో జరిగిన 3 మ్యాచ్ ల్లో కూడా టీమిండియా ఆటగాళ్లు “షేక్ హ్యాండ్” కూడా ఇవ్వలేదు. టీమిండియా అద్భుత విజయాన్ని సాధించినప్పటికీ.. ట్రోఫీ ప్రదానోత్సవం వివాదస్పదంగా మారి ఆసియా కప్ 2025 చరిత్రలో ఓ ప్రత్యేకంగా నిలిచింది.