E-Paper
Advertisement

Dry fruit Samosa: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!

Dry fruit Samosa: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!
Advertisement

Unique Dry Fruits Samosa:

సమోసా అంటే భారతీయులకు కేవలం ఒక స్నాక్ కాదు, ఒక ఎమోషన్! సాయంత్రం వేళ టీతో పాటు వేడి వేడి సమోసా తింటే, అలసట మాయమై ముఖంలో చిరునవ్వు వస్తుంది. ఆ క్రిస్పీ బయటి పొర, లోపల మసాలా ఫిల్లింగ్, పక్కన రుచికరమైన చట్నీ, ఇవన్నీ సమోసాను అపురూపమైన అనుభవంగా మార్చేస్తాయి. సాంప్రదాయ ఆలూ మటర్ సమోసా అందరికీ ఫేవరెట్ అయినప్పటికీ, కాలం మారుతున్న కొద్దీ సమోసా రకాలు కూడా మారుతున్నాయి. నూడుల్స్ సమోసా, పనీర్ సమోసా, చికెన్ సమోసా, మటన్ సమోసా లాంటివి ఇప్పుడు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఫుడ్ లవర్స్ కొత్త రుచుల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు కాబట్టి, ఈ కొత్త వేరియంట్ల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

మార్కెట్లోకి మరో క్రేజీ సమోసా!

ఇటీవల సోషల్ మీడియాలో ఒక కొత్త రకం సమోసా వైరల్‌గా మారింది. అదే డ్రై ఫ్రూట్ సమోసా. ఈ సమోసా గురించి వినగానే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఫుడ్ వ్లాగర్ అభిషేక్ అష్రా సూరత్‌లోని విధి సమోసా షాప్‌లో తీసిన ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  అది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్ సమోసా తయారీ ప్రక్రియను సాంప్రదాయ శైలిలో చూపించారు.

తయారీ ప్రాసెస్ వెరీ సింపుల్

Advertisement

ఇక ఈ సమోసా తయారీ కూడా సింపుల్ గానే ఉంది. తొలుత పెద్ద పెనంలో నూనె వేడి చేస్తారు. అందులో జీలకర్ర, ధనియాల గింజలు వేసి వేగించి, అల్లం, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు కలిపిన పేస్ట్‌ను జోడిస్తారు. తర్వాత పెద్ద డ్రమ్‌లో పప్పు మిశ్రమం, పోహా, వాసన వచ్చే మసాలాలు, ఎండిన కొబ్బరి పొడి కలుపుతారు. ఇక అసలు ట్విస్ట్ – జీడిపప్పు, కిస్మిస్, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్‌ ను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుతారు. ఈ ఫిల్లింగ్ ఘుమఘుమలాడే వాసనతో సిద్ధమవుతుంది. ఈ మిశ్రమాన్ని మైదా పిండితో తయారుచేసిన త్రిభుజాకార రొట్టెలో నింపి, వేడి నూనెలో గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయిస్తారు. రెడ్ చట్నీతో సర్వ్ చేస్తే, ఈ డ్రై ఫ్రూట్ సమోసా రుచి మరింత రెట్టింపవుతుంది.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. కొందరు, “ఇది కొత్తగా, ఆసక్తికరంగా ఉంది, తప్పక ట్రై చేయాలి” అని అనగా, మరికొందరు, “సమోసా అంటే స్పైసీ రుచే బెస్ట్, డ్రై ఫ్రూట్స్‌తో  రుచి వింతగా ఉంటుందేమో” అని సందేహం వ్యక్తం చేశారు.

సమోసాతో ఎక్స్‌పెరిమెంట్స్ కొత్తవి కాదు. గతంలో ఒక వ్లాగర్ సమోసా సలాడ్ తయారు చేసి వైరల్ అయ్యారు. ఇందులో సమోసా ముక్కలతో పాటు ఉల్లిపాయలు, దోసకాయ, లెట్ట్యూస్, పుదీనా చట్నీ, ఇమ్లీ చట్నీ, పెరుగు, అనార దాణాలు, జలపెనోస్ కలిపి సలాడ్‌గా సర్వ్ చేశారు. అది కూడా ఫుడ్ లవర్స్‌ ను ఆకట్టుకుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్ సమోసా కొత్త ట్రెండ్‌ గా మారింది. సాంప్రదాయ మసాలా రుచికి బదులు తీపి రుచిని జోడించే ఈ సమోసా ఖచ్చితంగా ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది. సమోసా ప్రియులు ఈ కొత్త రుచిని ట్రై చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also: వందేభారత్ లో ఎక్స్ పైరీ ఫుడ్, నిప్పులు చెరిగిన ప్రయాణీకులు, పోలీసుల ఎంట్రీ..

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×