trinayani serial today Episode: నయని, విక్రాంత్ టెన్షన్ పడుతుంటారు. భూత వైద్యుడికి మీరు దొరికిపోతే ఎలా అంటాడు విక్రాంత్. ఇంతలో రత్నాంభ వచ్చి ఆ ఆత్మలింగాన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అంటుంది. ఎక్కడ చూసి ఉంటారు అని నయని అడుగుతుంది. వాడి వల్ల పెద్దత్తయ్య ఆత్మను చూసి చాలా రోజులైంది వాడి వల్ల మళ్లీ చూడొచ్చంటే సంతోషంగా ఉందని చెప్తుంది హాసిని. రత్నాంభ షాక్ అవుతుంది. ఆత్మలను మీరు ఎలా చూస్తారు. అలాంటప్పుడు మీరు ఆత్మలింగాన్ని పిలిపించడం దేనికి అని రత్నాంభ అడుగుతుంది.
తనను తాను చూడలేదు కదా..? అంటాడు విక్రాంత్. అదేంటి నయని ఆత్మనా..? అంటూ రత్నాంభ ప్రశ్నిస్తుంది. ఇంతలో మీరు అన్నది నిజమే ఎందుకంటే కొత్త ఆత్మను నేను చూడలేనని అత్తయ్య ఆత్మలింగాన్ని పిలిపించింది అంటుంది నయని. కొత్త ఆత్మ ఎవరు అని హాసిని అడుగుతుంది. అది వాడే తేలుస్తాడు అంటుంది రత్నాంభ. ఆత్మలింగం ఇళ్లంతా నీళ్లు చలుతాడు. అందరూ హాల్ లోకి వస్తారు. నీకు ఎక్కువ మంత్రాలు రావా..? ఒక్కటే మంత్రం చదువుతున్నారు అని హాసిని అడుగుతుంది. నువ్వాగు హాస్ ఆయన ఏం చేస్తారో చూద్దాం అంటుంది దురందర. ఇంతలో ఆత్మలింగం ఊగుతూ.. పిల్లను ఇక్కడ కూర్చోబెట్టండి అంటాడు.
దీంతో నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పరా ముందు అంటుంది రత్నాంభ. పెద్దావిడకు చాదస్తం స్వామి మీరు పట్టించుకోకండి.. నయని ముందు గాయత్రి పాపను ఇక్కడ కూర్చోబెట్టు అని తిలొత్తమ్మ చెప్తుంది. నయని పాపను కింద కూర్చోబెట్టగానే పాప చుట్టూ తిరుగుతూ మంత్రాలు చదువుతుంటాడు. వీణ్ని చూస్తుంటే మా ఊళ్లో పిడకలు అమ్ముకునే వాడిలా ఉన్నాడు వీడు అంటూ రత్నాంభ తిడుతుంది. మీరు బాధపడకండి స్వామి ఆత్మలను పట్టండి ముందు అంటుంది తిలొత్తమ్మ. ఆత్మలింగం మళ్లీ లట లట అంటూ మంత్రం చదవగానే ఏయ్ చదివిన మంత్రమే ఎన్ని సార్లు చదువుతావు అంటూ వెటకారంగా తిడుతుంది హాసిని.
ఇలా అయితే నేను వెళ్లిపోతాను అంటాడు ఆత్మలింగం. నువ్వు కానివయ్యా బాబు లేదంటే మేము ఇచ్చిన డబ్బులు వేస్ట్ అవుతాయి అని వల్లభ చెప్పగానే.. సరే అంటూ గాయత్రి పాప చుట్టూ తిరుగుతుంటే పాప చేయి అడ్డం పెట్టగానే ఆత్మలింగం కిందపడిపోతాడు. కింద పడ్డ ఆత్మలింగాన్ని పైకి లేపబోయి జుట్టు మీద కాలు పెడతాడు వల్లభ. దీంతో ఆత్మలింగ విగ్గు ఊడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రత్నాంభ కోపంగా రేయ్ నువ్వు దేవీపురంలో గేదేలను కాసుకునే గాదే లింగానివి కదూ అంటూ తిడుతుంది.
వీడు ఆత్మలను పట్టడం ఏంటమ్మా ఐదు రూపాయలు ఇస్తే మా ఊరి చెరువులో గేదెలను కడుగుతాడు అని రత్నాంభ చెప్పగానే.. తిలొత్తమ్మ తిడుతుంది. వల్లభ, విక్రాంత్ కొట్టబోతే.. పైకి పారిపోతాడు. వెనకాలే వల్లభ వెళ్తాడు. నేను ఎప్పుడో చెప్పాను వాణ్ని ఎక్కడో చూశానని అంటుంది రత్నాంభ. ఇంతలో హాసిని కూడా పైకి వెళ్తుంది. పైకి రూంలోకి వెళ్లిన ఆత్మలింగం బాత్రూంలో దాక్కుంటాడు. అక్కడే నయని శరీరం ఉంటుంది. ఆ శరీరం చూసిన ఆత్మలింగం భయంతో నోరు మూసుకుంటాడు.
ఇందాక హాల్లో ఉంది కదా..? పాపను ఎత్తుకుని ఉన్నప్పుడు చూశాను. మరి ఇక్కడుందేంటి అనుకుంటూ భయంతో వణికిపోతుంటాడు. దెయ్యం అంటూ పారిపోతుంటాడు. పైకి వచ్చిన హాసిని, వల్లభ కూడా భయంతో దెయ్యం అంటూ కిందకు పరుగెత్తుకొస్తారు. కిందకు వచ్చిన ఆత్మలింగం స్పృహ తప్పి పడిపోతాడు. వల్లభ నీళ్లు చల్లగానే లేచి నయనిని చూసి దెయ్యం అంటూ భయపడుతుంటాడు. భయపడకు అని నయని అంటే నువ్వే భయపెట్టి భయపడకు అంటే ఎలా అంటూ నువ్వు చనిపోయావు కదా..? అంటాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?