IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 9వ సారి ఆసియా కప్ గెలుచుకుంది భారత్. పాకిస్తాన్ పై ఆసియా కప్ 2025 ఫైనల్స్ గెలిచినప్పటికీ టీమిండియా మాత్రం ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే..టీమిండియాను ఫైనల్స్ ఓడించాలని పాకిస్తాన్ విశ్వప్రయత్నాలు చేసింది. వాటిలో పాకిస్తాన్ బౌలర్ ఫహీమ్ అర్షఫ్ తొలి బంతి వేయకముందే కాళ్లకు ఏదో తిమ్మిర్లు వచ్చినట్టు యాక్టింగ్ చేశాడు. దీంతో దాదాపు 8 నిమిషాల పాటు బౌలింగ్ వేయకుండా మ్యాచ్ ని డిలే చేశాడు. ఇలా డీలే చేస్తే బ్యాటర్ల కాన్ సెంట్రేషన్ దెబ్బతింటుందని.. పాకిస్తాన్ విజయం సాధిస్తుందని భావించారు.
Also Read : IND VS PAK Final: పాకిస్థాన్ పై ఆపరేషన్ “తిలక్”…9వ సారి ఆసియా కప్ గెలిచిన టీమిండియా
కానీ పాకిస్తాన్ ఎన్ని ఎత్తు గడలు వేసినా టీమిండియా బ్యాటర్లు మాత్రం విఫలం చెందలేదు. ముఖ్యంగా తిలక్ వర్మ టీమిండియా కి ఫిల్లర్ల మాదిరిగా నిలబడి టీమిండియాని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ సమయంలో రిషబ్ పంత్…. సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని నాటకాల ఆడి గాయమైనట్లు… దాంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల కాన్సన్ట్రేషన్ మిస్ అయి.. అవుట్ అయ్యారు.. అప్పుడు టీమిండియా ఛాంపియన్ అయింది. అదే మాదిరిగా పాకిస్తాన్ కూడా తిలక్, శివం దుబే ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఫహీం కూడా గాయమైనట్లు ఓవర్ చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. హోరా హోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయిన టీమిండియా లక్ష్యాన్ని మాత్రం చేదించింది. మూడు బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేయాల్సిన సమయంలో… రింకు సింగ్ బౌండరీ కొట్టి జట్టును ఛాంపియన్ గా నిలిపాడు.
ప్రతీ మ్యాచ్ లో ఆకట్టుకున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో మాత్రం కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. శుబ్ మన్ గిల్ కూడా కేవలం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒకే ఒక్క పరుగులు చేసి ఔట్ కావడంతో పాకిస్తాన్ జట్టు అంతా సంబురాలు జరుపుకుంది. పాకిస్తాన్ గెలిచింది అనేలా వ్యవహరించింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ విజయం సాధించేంత వరకు టీమిండియా కి అండగా నిలబడి.. 53 బంతుల్లో 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సంజూ శాంసన్ 24, శివమ్ దూబే 33 వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. చివర్లో దూబే ఔట్ కావడంతో రింకూ సింగ్ వచ్చి విన్నింగ్ షాట్ ఆడాడు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో ఫహీం అష్రఫ్ 3, షాహీన్ అఫ్రిది 1, అబ్రార్ అహ్మద్ 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. అంతకు ముందు టీమిండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్ 4, అక్సర్ 2, వరుణ్ చక్రవర్తి 2, బుమ్రా 2 వికెట్లు తీయడంతో 19.1 ఓవర్లలో పాకిస్తాన్ 146 పరుగులు చేయగలిగింది.