BigTV English
Advertisement

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అంచనాలకు మించి ఆదాయం

Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అంచనాలకు మించి ఆదాయం

Astrology Today: నేటి రాశి ఫలాలు. మొత్తం 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉంది? ఆర్థికంగా ఎవరికి అనుకూలంగా ఉంది? వంటి విషయాలను జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. సమయాన్ని వృథా చేయకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. అందరి సహకారంతో ముందుకెళ్లాలి. గణపతిని దర్శించుకోవాలి.

వృషభం:
ప్రారంభించిన పనుల్లో విజయం పొందుతారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఎదురుదెబ్బలు తగులుతాయి. విధి నిర్వహణలో పొరబాట్లు చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారల్లో ఆదాయం పొందుతారు. ఇతరులతో ఆచితూచిగా అడుగులు వేయాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. వేంకటేశ్వరుడిని సందర్శించాలి.


మిథునం:
ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు లాభాలను చేకూరుస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయ. పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి ఢోకా ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దుర్గాస్తుతి చదవాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి వృత్తి జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేసే పనిలో పట్టు వదలరు. కొన్ని విషయాల్లో కష్టాలను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేరు అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు బాధకు గురిచేస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.

సింహం:
కీలక వ్యవహారాల్లో వ్యయప్రయాసలు తప్పదు. మంచి ఫలితాలను రాబట్టేందుకు సరైన సమయం. ప్రారంభించిన పనుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇష్టదైవాన్ని పూజించాలి.

కన్య:
చేసే పనిలో విజయం సాధిస్తారు. మీ రంగాల్లో కీర్తి వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. బంధువుల నుంచి ఆదరాభిమానాలు ఉంటాయి. స్నేహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

తుల:
సమయం అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లబ్ధి పొందుతారు. ఉద్యోగాల్లో మాటకు తిరుగు ఉండదు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యస్తుతి మేలు చేస్తుంది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలం. మంచి ఫలితాలు పొందుతారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఉంటాయి. ఏ ప్రయత్ని తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థికంగా లాభం పొందుతారు. సమస్యలు ఎదురుకావొచ్చు. ఆంజనేయుడిని దర్శించుకోవాలి.

ధనుస్సు:
ఆర్థిక పరిస్థి మెరుగ్గా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలంగా వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. దుర్గాస్తుతి చదవాలి.

మకరం:
ఈ రాశి వారికి అనుకూలతలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్త వింటారు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. వేంకటేశ్వరుడిని సందర్శించాలి.

కుంభం:
కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. పట్టుదలో ముందుకెళ్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మీనం:
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. పనులు వాయిదా వేయకండి. సమస్యలు అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

Related News

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Big Stories

×