BigTV English
Advertisement

Prabhas: ప్రమోషన్స్ హోగయా.. నీకు బాగా హ్యాపీగా ఉన్నది కదా డార్లింగ్

Prabhas: ప్రమోషన్స్ హోగయా.. నీకు బాగా హ్యాపీగా ఉన్నది కదా డార్లింగ్

Prabhas: ప్రభాస్ రాజు ఉప్పలపాటి.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా చూసిన అభిమానులు ఈ కుర్రాడు ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకున్నారు. కానీ, ఇదే కుర్రాడు వర్షం సినిమాతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.


ఇక ఆ తరువాత ప్రభాస్ నట ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెల్సిందే. ఆ రేంజ్ కటౌట్ కు ఏ సినిమా పడినా ఫ్యాన్స్ ఆదరించడం మొదలుపెట్టారు.విజయాపజయాలను పట్టించుకోకుండా ప్రభాస్.. వరుస సినిమాలతో బిజీగా మారాడు.

గతంలో ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసే ఈ హీరో.. ప్రస్తుతం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ షాక్ ఇస్తున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రభాస్ ఇంట్రోవర్ట్ అన్న విషయం తెల్సిందే. సినిమాలో గంభీరంగా ఉండే డార్లింగ్.. బయట చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్పాలి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం లేని హీరోగా డార్లింగ్ పేరు చెప్పొచ్చు. తక్కువ ఫ్రెండ్స్.. అందరిని పలకరించే గుణం. ముఖ్యంగా ఆతిధ్యానికి ప్రభాస్ కుటుంబం పెట్టింది పేరు.


ఇన్ని లక్షణాలు ఉన్న ప్రభాస్ కు బయట జనాల మధ్య మాట్లాడాలంటే చచ్చేంత సిగ్గు. అందుకే ప్రభాస్ ప్రమోషన్స్ లో చాలా తక్కువగా పాల్గొంటాడు. ఇప్పటివరకు ఏ స్టేజిమీద ప్రభాస్.. 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు అంటే అతిశయోక్తి కాదు. హయ్ డార్లింగ్స్.. సినిమా బావుంటుంది .. ఓకే, థాంక్స్.. ఈ పదాలు తప్ప స్టేజిమీద ప్రభాస్ ఏమి మాట్లాడాడు.

ఇక నిన్న కల్కి ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అవే మాటలు మాట్లాడాడు. కల్కికి ప్రమోషన్స్ చాలా తక్కువగా చేశారు. ఈ ఈవెంట్ మాత్రమే పెద్దది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకో ఈవెంట్ లేదు. దీంతో ప్రభాస్ ఆనందంతో ప్రమోషన్స్ హోగయా అంటూ సంబరపడిపోయాడు. ఇంకెక్కడా మాట్లాడాల్సిన పని లేదు అని ఆనందపడుతున్నట్లు కనిపించాడు.  ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక అభిమానుల మధ్యకు ప్రభాస్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ, ఇది మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కు పెద్ద దెబ్బనే. అందుకే నీకు బాగా హ్యాపీగా ఉన్నది కదా డార్లింగ్ అంటూ ఆట పట్టిస్తున్నారు. మరి ఈ వరం రోజుల్లో ప్రభాస్ ఇంకేదైనా ఇంటర్వ్యూ చేస్తాడేమో చూడాలి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×