BigTV English

Copper Sun Vastu: ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ఏ దిక్కులో పెట్టుకోవాలి…

Copper Sun Vastu: ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ఏ దిక్కులో పెట్టుకోవాలి…

Copper Sun Vastu:ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ఉంచితే ఇంటికి, కుటుంబసభ్యులకు పాజిటివ్ శక్తి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. రాగి సూర్యుడిని ఇంట్లో పెడితే కీర్తి, శ్రేయస్సు సిద్ధిస్తాయి. రాగిని ప్రభావవంతమైన లోహంగా పరిగణిస్తారు. రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టడం వల్ల సానుకూల శక్తి వస్తుంది.


కుటుంబసభ్యుల మధ్య సామరస్యాన్ని కొనసాగించడంలో ఉపయోగపడుతుంది. దాని నుండి వెలువడే శక్తి ఇంట్లో శ్రేయస్సును కలిగిస్తుంది. కుటుంబసభ్యుల మధ్య ఉండే అసమ్మతి, అసంతృప్తి తొలగిపోతాయి. రాగితో చేసిన సూర్యుడిని కార్యాలయాలు, వ్యాపార దుకాణాల్లో పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

రాగితో చేసిన సూర్యుడిని తూర్పు దిశలో ఉంచాలి. తూర్పు దిశలో కిటికీ ఉంటే దానికి వేలాడదీయాలి. కిటికీ లేకపోతే గోడకు వేలాడదీయవచ్చు. కుటుంబసభ్యుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడతాయి. తూర్పు దిశలో రాగితో చేసిన సూర్యుడిని ఉంచడం వల్ల ప్రేమ, అనురాగాలు పెంపొందుతాయి.


రాగి సూర్యుడిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ కడగడం, తుడవడం చేస్తుండాలి. రాగితో చేసిన సూర్యుడు కింద పడి విరిగిపోతే దానిని ఎట్టిపరిస్థితుల్లోనే మళ్లీ వేలాడదీయవద్దు.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×