BigTV English

Mahila Naga Sadhu: మహిళా నాగసాధువులు ఎక్కడ ఉంటారు ? వీరి గురించి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు !

Mahila Naga Sadhu: మహిళా నాగసాధువులు ఎక్కడ ఉంటారు ? వీరి గురించి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు !

Mahila Naga Sadhu: నాగ సాధువులు లేకుండా కుంభమేళాని ఊహించలేము. నాగ సాధువుల వేషధారణ, ఆహారపు అలవాట్లు సామాన్యులకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పురుషులలాగే స్త్రీలలో కూడా నాగ సాధువులు ఉంటారు.


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుండి మహా కుంభమేళా ప్రారంభమయింది. ఈ కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. నెలన్నర పాటు జరిగే మహాకుంభమేళాలో గంగా-యమునా, సరస్వతి త్రివేణి సంగమమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ కుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండిపెద్ద సంఖ్యలో సాధువులు, ఋషులు వస్తున్నారు. సనాతన ధర్మంలో ఋషులు , సాధువులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదిలా ఉంటే కుంభమేళాకు వచ్చే నాగ సాధువులు కాస్త భిన్నంగా ఉంటారని చెప్పవచ్చు. నాగ సాధువులు లేకుండా కుంభమేళాను అసలు ఊహించలేము. నాగ సాధువుల వేషధారణ, ఆహారపు అలవాట్లు సామాన్యులకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పురుషులలాగే స్త్రీలు కూడా నాగ సాధువులే. మహిళా నాగ సాధువులు కూడా తమ జీవితాలను పూర్తిగా భగవంతుడికి అంకితం చేస్తారు.


మహిళా నాగ సాధువు యొక్క రహస్య ప్రపంచం ఎలా ఉంటుంది ?

మహిళా నాగ సాధువుల జీవితం చాలా ప్రత్యేకమైనది. విభిన్నమైనది కూడా. గృహస్థ జీవితానికి దూరంగా ఉండే మహిళా నాగ సాధువుల రోజు.. పూజతో ప్రారంభమై పూజతోనే ముగుస్తుంది. వారి జీవితం అనేక రకాల కష్టాలతో నిండి ఉంటుంది. నాగ సాధువులకు ప్రపంచంతో సంబంధం లేదు. వారు చేసే ప్రతి పని ప్రత్యేకంగానే ఉంటుంది.

నాగ సాధువుగా మారిన తరువాత ఋషులు, సాధువులందరూ ఆమెను తల్లి అని పిలుస్తారు.ఋషులు , సాధువులలో నాగ అనేది ఒక బిరుదు. సాధువులలో వైష్ణవ, శైవ, ఉదాసని శాఖలు ఉన్నాయి. ఈ మూడు వర్గాల అఖారాలను నాగ సాధువులు నిర్మించారు.

ఆడ నాగ సాధువుగా ఎలా మారాలి ?

మగ నాగ సాధువులు నగ్నంగా ఉండవచ్చు. కానీ ఆడ నాగ సాధువులు అలా చేయడానికి అనుమతించబడరు. మగ నాగ సాధువులలో దుస్తులు ధరించిన వారు , దిగంబరులు (దుస్తులు లేనివారు) కూడా ఉంటారు. స్త్రీలు కూడా దీక్షలు చేసి నాగసాదువులుగా మారతారు. కానీ వారందరూ దుస్తులు ధరిస్తారు. మహిళా నాగ సాధువులు తమ నుదుటిపై తిలకం దిద్దుకుంటారు. వీరు కుట్లు వేయని కుంకుమపువ్వు రంగు వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. ఈ వస్త్రాన్ని గంటి అంటారు.

నాగ సాధువుగా మారే ప్రక్రియ చాలా కష్టం:

ఆడ నాగ సాధువుగా మారే ప్రక్రియ గురించి తెలుసుకున్న తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మహిళా నాగ సాధువుల జీవితం చాలా కష్టం. నాగ సాధువు కావాలంటే వారు కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. నాగ సాధువు లేదా సన్యాసిని కావాలంటే 10 నుండి 15 సంవత్సరాల వరకు కఠినమైన బ్రహ్మచర్యం పాటించాలి. నాగ సాధువు కావాలంటే, ఆమె దానికి అర్హురాలని, దేవునికి అంకితమైందని ఆమె గురువును ఒప్పించాలి. దీని తరువాత గురువు నాగ సాధువుగా మారడానికి అనుమతి ఇస్తాడు.

నాగ సాధువుగా మారడానికి ముందు, ముండన్ చేయాలి:

నాగ సాదువుగా మారాలనుకున్న మహిళ యొక్క గత జీవితం. భగవంతుడిపై ఆమెకు భక్తి ఉందా లేదా అన్నది కూడా గురువులు గమనిస్తారు. నాగ సాధువు అయిన తర్వాత కష్టమైన ధ్యానం చేయాలి. అంతే కాకుండా నాగ సాధువు కావడానికి ముందుపిండ్ ప్రదానం కూడా చేయాలి.

Also Read: ఇలా చేస్తే.. ఇంట్లోనే కుంభమేళాకు వెళ్లినంత పుణ్యం

అఖారాలో పూర్తి గౌరవం లభిస్తుంది:
మహిళా నాగ సాధువులు రోజంతా భగవంతుని జపం చేసి, ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శివుడిని జపిస్తారు. సాయంత్రం దత్తాత్రేయుని ఆరాధన. మధ్యాహ్న భోజనం తర్వాత శివుడిని కీర్తిస్తారు. మహిళా నాగ సాధువులకు అఖారాలో పూర్తి గౌరవం ఇస్తారు.

కుంభమేళా సమయంలో నాగ సాధువులతో పాటు మహిళా సాధువులు కూడా రాజ స్నానం చేస్తారు. అయితే, మగ నాగ సాదువు స్నానం చేసిన తర్వాత మహిళా నాగ సాదువులు స్నానం చేస్తారు.

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×