E-Paper
Advertisement

గెలుపు సరే.. రాజకీయ కుట్రల సంగతి ఏమిటీ? విజయ్ ముందున్న అసలు సవాళ్లు ఇవే!

గెలుపు సరే.. రాజకీయ కుట్రల సంగతి ఏమిటీ? విజయ్ ముందున్న అసలు సవాళ్లు ఇవే!
Advertisement

Vijay Politics: రాజకీయ ఉద్ధండులను తట్టుకొని గెలిచాడు.. ఎంట్రీతోనే కుంభస్థలాన్ని బద్దలుకొట్టి చూపించాడు. మరి.. రాజకీయం చేసే కుట్రలను దాటుకొని నిలబడతాడా? ఇదే.. ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న. విజయ్ చించేశాడు.. హిస్టరీ క్రియేట్ చేశాడు.. ద్రవిడ సిద్ధాంత పార్టీలకు ఊహించని విధంగా చెక్ పెట్టేశాడు.. తమిళనాడు భవిష్యత్ రాజకీయాలకు సరికొత్త దిశను చూపిస్తాడు.. ఇక అతనికి తిరుగులేదు.. ఎదురులేదు లాంటి ఎలివేషన్లు కనిపిస్తున్నాయ్ ఇప్పుడు. నిజానికి.. గెలుపులో ఉండే మ్యాజిక్ అది. విజయం మన పక్కన ఉంటే.. ఇలాంటి పొగడ్తలు, కీర్తనలు, భజనలు.. ఆహా, ఓహోలు.. ఆకాశానికి ఎత్తేయడాలు.. లాంటివి చాలానే ఉంటాయ్. అందుకే అంటున్నది.. అప్పుడే ఏమైంది? ఇప్పుడే మొదలైంది.. అని!

తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం

దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య సాగుతున్న రాజకీయాలను బద్దలు కొట్టి, మూడో ప్రత్యామ్నాయంగా టీవీకే సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు. ఈ గెలుపు ఓ ఆరంభం మాత్రమే. విజయ్ ముందున్న అసలైన సవాళ్లు, ఎదుర్కోవాల్సిన రాజకీయ వ్యూహాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే, తమిళనాడులో సినీ గ్లామర్‌కు, పొలిటికల్ పవర్‌కు విడదీయలేని అనుబంధం ఉంది.

టీవీకే భారీ విజయం వెనుక రహస్యం

Advertisement

కానీ, రజనీకాంత్ లాంటి సూపర్ స్టారే వెనకడుగు వేసిన చోట, విజయ్ ధైర్యంగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. కేవలం ఫ్యాన్ బేస్ మాత్రమే కాకుండా, మార్పు కోరుకునే యువత విజయ్ వైపు మొగ్గు చూపారు. సిద్ధాంతపరంగా అటు ద్రవిడ భావజాలాన్ని, ఇటు సెక్యులరిజాన్ని కలుపుకుంటూ ఆయన తీసుకున్న స్టాండ్ ఓటర్లను ఆకట్టుకుంది. పార్టీ ప్రకటించకముందే విజయ్ క్షేత్రస్థాయిలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు కలిసొచ్చాయ్. అలా.. టీవీకేకు భారీ విజయం దక్కింది.

డీఎంకే-ఏఐఏడీఎంకే చరిత్రకు చెక్

తమిళనాడులో విజయ్ అద్భుత విజయం సాధించాడు కాబట్టి.. నేషనల్ లెవెల్‌లో అతని పేరు రీసౌండ్ వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో గెలిచిన బీజేపీ తీరు కంటే.. విజయ్ గురించే ఇండియా అంతా చర్చిస్తోంది. ఎందుకంటే, రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. 77 ఏళ్ల చరిత్ర ఉన్న డీఎంకేని, 54 ఏళ్ల హిస్టరీ ఉన్న ఏడీఎంకేని మట్టికరిపించాడు. అందుకే.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్లందరికీ ఇప్పుడు దళపతే ఆదర్శం. అందువల్లే.. చాలా మంది ఆయన్ని సొంత మనిషి అనుకుంటున్నారు. నేషనల్, రీజినల్ అనే తేడా లేకుండా.. మీడియా, సోషల్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది. మరోవైపు.. చాలా ఏళ్ల తర్వాత భారత రాజకీయాల్లో దళిత ఆశాకిరణంలా మారారు విజయ్. అందుకే.. ఇంత ఫోకస్ కనిపిస్తోంది.

ఓడిపోయి ఉంటే విజయ్ పరిస్థితి?

Advertisement

ఇక్కడిదాకా బాగానే ఉంది! విజయ్ గెలిచాడు కాబట్టి ఓకే! అదే.. విజయ్ ఓడిపోయి ఉంటే? ఇదే దళపతిని.. ఈ సమాజం, రాజకీయ వర్గాలు.. అత్యంత దారుణంగా విమర్శించేవి. ఓ చేతగాని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసేవి. సైలెంట్‌గా సినిమాలు చేసుకోక, రాజకీయాలు ఎందుకు అని.. మిగిలిన పార్టీలు టార్గెట్ చేసేవి. అతని పర్సనల్ వ్యవహారాలు మళ్లీ రచ్చకెక్కేవి. త్రిష వ్యవహారాన్ని ముందుకు తెచ్చి.. రచ్చ రచ్చ చేసేవారు. విజయ్ వాపు చూసి బలుపు అనుకున్నాడని, అతనికి రాజకీయం చేతగాదని, తమిళనాడు అతన్ని పూర్తిగా నమ్మలేకపోయిందని.. ఇలా ఎన్నో విమర్శలు, మరెన్నో కామెంట్లు వినిపించేవి.

విజయ్‌కు అసలు పరీక్ష ఇప్పుడే

కానీ.. టీవీకే గెలుపే అన్నింటికీ సమాధానం చెప్పింది. అందువల్లే.. ఇప్పుడు సీన్లు మరోలా కనిపిస్తున్నాయ్. ఎందుకంటే.. విక్టరీ అనేది తీపి పదార్థం లాంటిది. పొగడ్తలు, భజనలు, ఎలివేషన్లు దాని చుట్టూ చేరే ఈగల్లాంటివి! అదే.. ఓటమి విషయం లాంటిది. ఈ రియాలిటీని గుర్తిస్తే.. విజయ్ రాజకీయాల్లో నిలబడగలుగుతాడు. లేకపోతే.. అట్టర్‌ ఫ్లాప్ పొలిటికల్ హీరోలానే మిగిలిపోతాడు. అందువల్లే.. విజయ్‌కి అసలైన సవాళ్లు ముందున్నాయనే డిస్కషన్ మొదలైందిప్పుడు.

టీవీకేపై కీలక ప్రశ్నలు

దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో పాతుకుపోయి, రాష్ట్రంలో అధికారం చెలాయించి, రాష్ట్ర రాజకీయాలను శాసించిన ద్రవిడ సిద్ధాంతపు పునాదులపై నిలబడిన పార్టీల కుట్రలను.. విజయ్ టీవీకే తట్టుకోగలదా? వాటన్నింటిని దాటుకొని నిలబడి.. మనుగడ సాగించగలదా? మొత్తంగా.. తమిళ రాజకీయాల్లో టీవీకే పాతుకుపోగలదా? అనే ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయ్. ఎందుకంటే.. పార్టీ పెట్టడం, రెండేళ్ల గ్యాప్‌లోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, అందరి అంచనాలను తలకిందులు చేసి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కదులుతుండటం లాంటివన్నీ.. గొప్ప విషయాలే!

విజయ్ ఎలా ఎదుర్కొంటాడు?

విజయ్ సాధించిన విజయాలే! ఇదంతా.. రెండు గంటల సినిమాల్లో ఎలా జరుగుతుందో.. రెండేళ్లలో అలా జరిగిపోయిందంతా! కానీ, సినిమా వేరు.. రాజకీయం వేరు. సీఎం పదవి అనేది.. ముళ్ల కిరీటం లాంటిది. రాజకీయమంటే.. పూల పాన్పు కాదు. అన్నిసార్లు.. రెడ్ కార్పెట్లు, పూల తోరణాలే ఉండవు. పూలు పడేటప్పుడు పూలు పడతాయ్.. రాళ్లు పడేటప్పుడు రాళ్లు పడతాయ్. ఏది పడినా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మనమెలా ఉండగలుగుతున్నాం? ఎంతవరకు తట్టుకుంటాం? అనేదే.. రాజకీయాల్లో నాయకుల ఉనికిని నిర్ణయిస్తుంది. భవిష్యత్‌ని నిర్దేశిస్తుంది. ఇప్పుడు.. విజయ్ అలాంటి పరిస్థితులనే ఎదుర్కోబోతున్నారు. ద్రవిడ, జాతీయ పార్టీల రాజకీయాన్ని తట్టుకొని విజయ్ పాలిటిక్స్‌లో రాణించగలుగుతాడా? తను నమ్మిన సిద్ధాంతాని కట్టుబడి రాజకీయం చేయగలడా? అనేదే.. ఇప్పుడు తేలాల్సిన విషయం. కాకపోతే.. దీనికి కాస్త టైమ్ పడుతుంది. ఆ టైమొచ్చినప్పుడు విజయ్ ఎలా వ్యవహరిస్తాడన్నదే ఇప్పుడు మేజర్ పాయింట్.

విజయ్‌కు అసలు టెస్ట్

సినిమా క్లైమాక్స్‌ల్లో.. హీరో విలన్‌ని ఓడించగానే.. కథ ముగిసిపోతుంది. శుభం కార్డ్ పడుతుంది. కానీ.. రాజకీయాల్లో అలా కాదు. గెలిచిన దగ్గరి నుంచే అసలు కథ మొదలవుతుంది. తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించి, దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ.. విజయాన్ని అందుకున్నారు విజయ్. గెలవడం ఒకెత్తు అయితే, ఇప్పుడు అధికారం పీఠంవైపు అడుగులు వేయడం, దక్కిన అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడపడం.. మరో ఎత్తు.

డీఎంకే-ఏఐఏడీఎంకే షాక్

దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో వేళ్లూనుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలు ఓటమిని అంతగా సులభంగా జీర్ణించుకోలేవు. పైగా.. విజయ్ లాంటి ఓ కొత్త పొలిటికల్ ఎంట్రీని, టీవీకే పార్టీ విజయాన్ని అస్సలు తట్టుకోలేవు. అప్పుడే.. తెరవెనుక కుట్రలు మొదలవుతాయ్. పాలిటిక్స్‌లో పవర్ షిఫ్ట్ అయినప్పుడు.. పాత తరం నాయకులు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తుంటారు. అనుభవం ఉన్న నాయకులు, అసెంబ్లీలో విజయ్‌ని, టీవీకే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారు.

పాలిటిక్స్‌లో కొత్త సమీకరణాలు

తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడం విజయ్‌కి ఇప్పుడు పరీక్ష అనే చెప్పాలి. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత లాంటి సినీ స్టార్స్ సక్సెస్ అయ్యారు. కానీ, విజయ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు డిఫరెంట్. సోషల్ మీడియా ప్రభావం, ఓటర్లలో పెరిగిన అవగాహన మధ్య ప్రతి అడుగు పక్కాగా ఉండాలి. టీవీకే పార్టీ గెలుపు దరికి చేరేందుకు పెద్దగా సమయం పట్టకపోయి ఉండొచ్చు. కానీ.. జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో పనిచేయాల్సి ఉంటుంది.

Also Read: ఫాతిమా కాలేజీపై హైడ్రా సంచలన నిర్ణయం.. సర్వే తర్వాతే అసలు యాక్షన్!

సవాళ్లకు సిద్ధమా విజయ్?

విజయ్ పార్టీకి అసలైన సవాళ్లు ఇప్పుడే ఎదురుకాబోతున్నాయ్. దళిత్ బ్యాక్‌గ్రౌండ్, క్రిస్టియన్ ముద్ర ఉన్న విజయ్.. సీఎం కుర్చీలో కూర్చోవడాన్ని ఎంతమంది జీర్ణించుకోగలుగుతారన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. పైగా.. దళిత బ్యాక్‌గ్రౌండ్ ఉండి.. ఈ దేశంలో సీఎం స్థాయికి ఎదిగిన నేతలని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అందువల్ల.. ప్రత్యర్థి పార్టీల ఎత్తులను విజయ్ తట్టుకోగలరా? వాళ్లు ఎత్తులకు పైఎత్తులు వేసేంత వ్యూహాం ఉందా? అనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పైగా.. విజయ్‌కి, ఆయన పార్టీకి రెండేళ్ల రాజకీయ అనుభవం మాత్రమే ఉంది. మరి.. పార్టీలో ఉన్న నేతలందరినీ ఎలా డీల్ చేస్తారన్నది కూడా పాయింటే. ఎందుకంటే.. ఈ దేశంలో పుట్టిన ఎన్నో పార్టీలు సంచలన విజయాలు నమోదు చేశాయ్. కానీ, కొద్దికాలంలోనే పొలిటికల్ స్క్రీన్‌పై కనిపించకుండా పోయాయ్. ఒకట్రెండు పార్టీలు మాత్రమే.. సంక్షోభాలను ఎదుర్కొని ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయ్. ఇందుకు.. చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయ్.

చరిత్ర చెబుతున్నది ఒక్కటే

ఒకప్పుడు తెలుగునాట ఎన్టీఆర్ ప్రభంజనం కనిపించింది. కాంగ్రెస్‌ని ఆధిపత్యానికి గండికొడుతూ.. తెలుగు ఆత్మగౌరవ పతాకను ఎగరేసి.. ఎన్టీఆర్ సాధించిన విజయం ఇండియా అంతటా మార్మోగింది. కానీ.. ఆరు నెలల్లోనే.. నాదెండ్ల భాస్కరరావు రూపంలో సంక్షోభం వెంటాడింది. దీని వెనుక జరిగిన కుట్ర, పొలిటికల్ గేమ్ ఏంటో అందరికీ తెలుసు! మహారాష్ట్రలోనూ ఉద్ధవ్ ఠాక్రేకు.. ఏక్‌నాథ్ షిండే రూపంలో ఎలాంటి గాయం తగిలిందో దేశమంతా చూసింది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే.. ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీతో.. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో చూశాం. కానీ.. లిక్కర్ కేసు ఆప్‌ని ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఇప్పుడు చూస్తున్నాం. పక్కనున్న పంజాబ్‌లోనూ ఆప్ పరిస్థితి అదోరకంగానే ఉంది. ఇక.. బీహార్‌లో నితీష్ కుమార్ ఎంత పవర్‌ఫుల్ లీడరో తెలుసు. కానీ, ఇప్పుడు అధికారాన్ని బీజేపీకి అప్పగించి.. రాజ్యసభ సీటుతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా.. బీజేపీని తట్టుకొని విజయ్ నిలబడగలడా? అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్.

విజయ్‌కు నిజమైన సవాలు

ఢిల్లీ రాజకీయం సంగతి అలా ఉంచితే.. ముందు తమిళనాడులో రాజకీయ కుట్రలను విజయ్ ఛేదించగలరా? అనేది కూడా మిస్టరీగానే కనిపిస్తోంది. ముఖ్యంగా.. దళిత పార్టీని, దళితుడిని.. మిగతా రాజకీయ పార్టీలు, నేతలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు అధికారం అతనికిచ్చారని.. సైలెంట్‌గా ఉంటారా? లేక తట్టుకోలేక వెనకనుంచి ఏమైనా గోతులు తవ్వుతారా? అనేది ఆసక్తి రేపుతోంది. సొంత పార్టీ నేతలే.. వెన్నుపోటు పొడిచే పరిస్థితులు వస్తే.. విజయ్ ఏం చేస్తారు? త్రిష రూపంలోనూ ముప్పు పొంచి ఉంటుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయ్. విజయ్‌కి రాజకీయ అనుభవం పెద్దగా లేదు. దాంతో.. టీవీకే పార్టీలో ఉన్న సీనియర్లే దెబ్బేస్తారా? అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది.

కుట్రల నీడలో టీవీకే

చెప్పలేం.. కుట్రలు ఏ మూలనైనా జరగొచ్చు. ముప్పు ఎక్కడి నుంచైనా పొంచి ఉండొచ్చు. అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే, మరోవైపు బీజేపీ.. టీవీకేని దెబ్బకొట్టేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉండొచ్చు. టైమ్ రాగానే.. తొక్కిపడేసే అవకాశాలుంటాయ్. కానీ.. ప్రత్యర్థులకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. వాళ్లకు అసలే దొరకకుండా విజయ్ ఎలాంటి రాజకీయం చేస్తారు? ప్రభుత్వాన్ని ఎంత తెలివిగా నడుపుతారనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. అంతేకాదు, తన పార్టీ నేతలు అవినీతికి పాల్పడకుండా చూసుకోవడం, పాలనలో పారదర్శకత తీసుకురావడం విజయ్ ఇమేజ్‌కు ఇప్పుడు చాలా ముఖ్యం. క్లిష్ట పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలే ఒక నాయకుడి భవిష్యత్తుని, పార్టీ మనుగడని నిర్ణయిస్తాయ్. ఇప్పుడు.. విజయ్ చరిష్మా మీదే టీవీకే గెలిచింది. కానీ.. అది నిలబడాలంటే.. బలమైన సెకండ్ లైన్ లీడర్‌షిప్ అవసరం.

తమిళ రాజకీయాల్లో విజయ్ స్థిరపడతాడా?

రాజకీయాల్లో నిలబడాలంటే ఓర్పుతో పాటు నేర్పు కూడా ఉండాలి. గెలిచేశాం.. ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నట్లు కాకుండా.. కమిట్‌మెంట్‌తో ప్రజలకు సేవ చేయగలిగితే, ఎంజీఆర్, జయలలిత తరహాలో ప్రజల గుండెల్లో నిలిచే అవకాశం ఉంటుంది. నిజానికి.. తమిళ రాజకీయాల్లో ఇప్పుడే ఒక కొత్త శకం మొదలైంది. అక్కడున్న పొలిటికల్ వాక్యూమ్‌ని విజయ్ సరైన టైమ్‌లో ఎంట్రీ ఇచ్చి ఫిల్ చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు కావాలని ప్రజలు కోరుకున్నారు. విజయ్ ఆ ప్లేస్‌ని.. రీప్లేస్ చేశారని ఈ ఫలితాలు నిరూపించాయ్. రాజకీయాల్లో కుట్రలు సహజం. కానీ, వాటిని దాటుకొని ప్రజల మనిషిగా నిలబడితే.. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే కూడా వేళ్లూనుకుపోవడం ఖాయం.

Also Read: స్ట్రీట్ లైట్ల నిర్వహణలో నయా రూల్స్.. వెలగకపోతే కాంట్రాక్టర్లకు జరిమానా!

Story by: Anup, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×