E-Paper
Advertisement

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే
Advertisement

Jagannath Mystery : మాములుగా మనం గుళ్ళల్లో చూసే ఏ దేవుడైనా నిండుగా,ఆభరణాలు ధరించి సుందరంగా ముస్తాబై ఉంటాయి.కానీ జగన్నాథుడు మాత్రం కాళ్ళు, చేతులు సరిగ్గా లేని అసంపూర్ణ రూపంతో, రెప్పవాల్చని భారీ గుండ్రటి కళ్లతో కనిపిస్తాడు. ఈ వింత ఆకారం వెనుక దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథలు వింటే ఎవరైనా నోరెళ్ళ బెట్టాల్సిందే.ఇక కాళ్ళు, చేతులు సరిగ్గా లేని ఆ ఆకారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

ఎవరూ లోపలికి రావద్దన్నది ఆయన కండీషన్

Advertisement

ఇంద్రద్యుమ్న అనే మహారాజు కోసం దేవశిల్పి విశ్వకర్మ ఒక గదిలో తలుపులు మూసుకుని విగ్రహాలను చెక్కడం మొదలెడతాడు.అయితే పని పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రావద్దన్నది ఆయన కండీషన్. కానీ కుతూహలం ఆపుకోలేక రాజు తలుపులు తీయడంతో, పని పూర్తికాకుండానే విశ్వకర్మ మాయమైపోతాడు. అలా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మలు అసంపూర్ణ రూపంలోనే ఉండిపోయారన్నది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న కథ. అయితే ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, భగవంతుడు కావాలనే ఈ రూపాన్ని ఎంచుకున్నాడని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆ కనిపిచే పెద్ద కళ్ళు.. భక్తుడిపై ఆయనకు ఉన్న నిరంతర దృష్టికి సంకేతం. ద్వారకలో రోహిణి మాత కృష్ణ లీలలు చెబుతుంటే, అది విన్న సుభద్ర, బలరామకృష్ణులు ఆ పరమానందంలో కళ్ళు పెద్దవి చేసుకుని, ఒళ్ళు మర్చిపోయి అలా ఉండిపోయారట. ఆ పారవశ్య స్థితికి ప్రతిరూపమే పూరీ విగ్రహాలు.

also read :ప్రేమ పెళ్లి.. నాలుగేళ్లకే పెటాకులు…డైవోర్స్ నిజమేనంటున్న బాలీవుడ్ బ్యూటీ

Advertisement

జగన్నాథుడికి వేళ్లు, పాదాలు ఉండవు

మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏమిటంటే.. జగన్నాథుడి విగ్రహాలను కేవలం ‘వేప’ చెట్టు కలపతోనే (దారువు) చేస్తారు. దీని వెనుక త్రేతాయుగం నాటి శ్రీరాముడి శాపం ఉందనే కథ ప్రచారంలో ఉంది. వాలిని చెట్టు చాటు నుండి చంపినందుకు , కలియుగంలో తాను చేతులు (మణికట్టు) లేని విగ్రహంగా, చేదుగా ఉండే వేప చెట్టు రూపంలో వెలుస్తానని రాముడు వాలికి ఇచ్చిన మాట ప్రకారం ఈ రూపం ఏర్పడిందని చెబుతుంటారు. అందుకే జగన్నాథుడికి వేళ్లు, పాదాలు ఉండవు. భగవంతుడికి భౌతిక అవయవాలైన చేతులు,కాళ్ళతో పనిలేదని, ఆయన హృదయంతో వింటాడని, ఆత్మతో చూస్తాడని చెప్పడమే ఈ విగ్రహం ఇచ్చే గొప్ప సందేశం అని ప్రతీతి.

ఆ పెద్ద కళ్లే సాక్ష్యం

కేవలం విగ్రహమే కాదండోయ్.. ఈ ఆలయంలోని ప్రతి అడుగు ఒక రహస్యమే. ప్రధాన సింహద్వారం దాటాక కనిపించే మూడవ మెట్టును ‘యమశిల’ అంటారు. ఈ మెట్టును తొక్కితే చేసిన పుణ్యమంతా పోతుందని పురాణాలు చెబుతాయి. అందుకే భక్తులు లోపలికి వెళ్లేటప్పుడు దానిపై అడుగు వేసినా, బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఆ మెట్టును తొక్కకుండా పక్క నుంచి వస్తారు. అలాగే గుడిపైన  ఉండే జెండా ఎప్పుడూ గాలికి అపోజిట్ గా  ఎగరడం, ఆలయంపై నుంచి ఏ పక్షి ఎగరకపోవడం వంటి వాటిని ఇప్పటికీ ఎవరూ చేదించకపోవడం గమనార్హం.ఇకపోతే  జగన్నాథుడి విగ్రహం అసంపూర్ణంగా కనిపించినా, ఆ రూపం ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.ఇక తనను నమ్మి వచ్చే భక్తుల కోసం ఆ పరమాత్మ రెప్పవాల్చకుండా చూస్తున్నాడని చెప్పడానికి ఆ పెద్ద కళ్లే సాక్ష్యం! అందుకే పూరీ జగన్నాథుడిని చూసిన ప్రతి భక్తుడి కన్ను చెమర్చడం ఖాయం.మొత్తానికి కాళ్ళు, చేతులు సరిగ్గా లేని ఆ ఆకారం వెనుకున్న అసలు స్టోరీ అదన్న మాట.

also read :బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ కోసం రంగంలోకి శివన్న.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×