Char Dham Yatra Updates: జీవితంలో ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేయాలని భావిస్తుంటారు భక్తులు. దక్షిణ, తూర్పు భారత్‌లో వేడి విపరీతంగా ఉండడంతో భక్తులు ఒక్కసారిగా పొటెత్తారు. వాహనాలు మాటేమోగానీ, భక్తులు కనీసం ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఏకంగా 8 కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు స్వామిని చూసేందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో విపరీతమైన రద్దీ
ఉత్తరాఖండ్‌లోని అత్యంత పుణ్యక్షేత్రాల్లో నాలుగు ధామాలు ఉన్నాయి. వాటిలో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలు. ఈ నాలుగింటిని కలిసి చార్ ధామ్ యాత్రగా చెబుతారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ ప్రాంతంలో రహదారులు ఓపెన్ అవుతాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
ఈసారి వాతావరణ వేడిగా ఉండడంతో ఈ యాత్ర చిన్నారులతోపాటు కుటుంబాలు సైతం బయలుదేరాయి. యాత్రకు భక్తులు ఊహించిన దానికంటే అధికంగా పోటెత్తుతున్నారు. భక్తులు భారీగా రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించింది. ముఖ్యంగా జోషీమఠ్-మార్వారీ మార్గంలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఎటు చూసినా భక్తులు.. 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
వీకెండ్ కావడంతో కేదార్‌నాథ్-గోవింద్ ఘాట్స్-జోషిమఠ్ సమీపంలోని మార్గాల్లో రద్దీ పెరగడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు బారులు తీరాయి. యాత్రికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్గ మధ్యలో ఆహారం, నీళ్లు సదుపాయాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ట్రాఫిక్ విషయం తెలియగానే స్థానిక అధికారులు-పోలీసులు రంగంలోకి దిగారు. భక్తుల రద్దీ పెరగటంతో యాత్రకు వెళ్లే భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేసుకోవాలని సూచిస్తున్నారు. ట్రాఫిక్ కు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జీరో బ్యాండ్ నుండి ఎనిమిది కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ నిలిచి పోయింది.
ALSO READ: ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే
అదే సమయంలో హేమకుండ్ యాత్ర ప్రారంభం కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. పోలీసులు-అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు జోషిమఠ్‌లో అధికారులు గేట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఏర్పాటు చేసిన విధానం ప్రకారం.. వాహనాలను ఒకే దిశ నుండి మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తారు. ఎదురుగా వచ్చే వాహనాలను తాత్కాలికంగా నిలిపి వేస్తారు. ఇరువైపులా వాహనాల రాకపోకలను అరగంటపాటు మార్చి నియంత్రిస్తున్నారు. ఈ విషయాన్ని జోషిమఠ్ ఎస్డీఎం చంద్రశేఖర్ వశిష్ఠ్ తెలిపారు.