E-Paper
Advertisement

బెంగాల్ రాత మార్చిన SIR.. టీఎంసీ పతనానికి అసలు కారణం అదేనా..?

బెంగాల్ రాత మార్చిన SIR.. టీఎంసీ పతనానికి అసలు కారణం అదేనా..?
Advertisement

Bengal SIR: బెంగాల్ ఎన్నికల రాజకీయాల్లో స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్.. SIR ప్రక్రియ పెను తుఫానును సృష్టించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓటర్ల జాబితా ప్రక్షాళన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. 91 లక్షల ఓట్ల తొలగింపు కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు.. బెంగాల్ రాజకీయాల్లో ఇదో గేమ్ ఛేంజర్. అధికార టీఎంసీకి ఇది ప్రజాస్వామ్య హననం అయితే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం దాన్ని అక్రమ ఓట్ల ఏరివేతగా అభివర్ణించింది. ఏదేమైనా ఓటర్ల జాబితా సవరణ 2026 బెంగాల్ రాతనే మార్చేసింది.

సర్ ప్రక్రియలో..

ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి 12శాతం ఓట్లను తొలగించారు. లెక్కల్లో చెప్పాలంటే అక్షరాలా 91లక్షల మంది ఓట్లు రద్దయ్యాయి. 2025 నవంబర్‌లో ప్రారంభమైన సర్ ప్రక్రియలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారు, అడ్రస్ ఆధారాలు సరిగ్గా లేని వారి ఓట్లు తొలగించారు. ఫలితంగా 2025 అక్టోబర్‌లో 7కోట్ల 66 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ప్రక్షాళన తర్వాత 6కోట్ల 75 లక్షలకు పడిపోయింది. అంటే 91 లక్షల బోగస్, అక్రమ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. అయితే ఈ ప్రక్రియ ఆషామాషీగా జరగలేదు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా ధృవీకరించారు. చనిపోయిన వారు, వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, ఒకే పేరుతో రెండు చోట్ల ఓటు ఉన్నవారు అనర్హులను జాబితా నుండి తొలగించారు. ముఖ్యంగా బెంగాల్ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో, లిగసీ లింకేజ్ ద్వారా డాక్యుమెంట్లు ధృవీకరణను కఠినతరం చేశారు.

2019 నుంచి బీజేపీకి..

Advertisement

ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు ప్రభుత్వ ఏర్పాటు కీలకమైన మైనారిటీ ప్రాంతాల్లో జరిగాయి. తృణమూల్‌కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా ఓట్ల కోతలు పడ్డాయి. 2019 నుంచి బీజేపీకి అండగా నిలుస్తున్న మతువా శరణార్ధ ప్రాంతాలైన ఉత్తర 24 పరగణాలు, నదియా, ఉత్తర బెంగాల్‌లోనూ భారీగా ఓట్లు తగ్గాయి. దీంతో తృణమూల్‌కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్‌లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఉత్తర బెంగాల్, జంగల్‌ మహల్‌ ప్రాంతాల్లో బీజేపీ పట్టును పెరింది. వాస్తవానికి బెంగాల్‌లో తృణమూల్ లెక్కలన్నీ మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో టీఎంసీ ప్రభావం తగ్గింది. సర్‌కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్‌ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో కూడా తృణమూల్ పరిస్థితిని మరింత దిగజార్చింది.

Also Read: BJP Laxman: కాస్కో రేవంత్ రెడ్డి.. గుణపాఠం తప్పదు.. బీజేపీ నేత లక్ష్మణ్ వార్నింగ్

ముస్లిం మైనార్టీల ప్రభావం..

Advertisement

పౌరసత్వం, వలసలు ప్రధానాంశాలుగా ఉన్న బంగ్లాదేశ్‌ సరిహద్దు జిల్లాల్లో సర్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. 31 అసెంబ్లీ సీట్లున్న ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లను సర్‌ ద్వారా ఈసీ తొలగించింది. 33 సీట్లున్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.91 లక్షల ఓట్లు, 22 సీట్లున్న ముర్షీదాబాద్‌లో 7.48 లక్షల ఓట్ల, 17 నియోజకవర్గాలున్న నదియాలో 4.85 లక్షల ఓట్లు, 6 నియోజకవర్గాలున్న మాల్దాలో 4.59 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. తొలగించిన ఓట్లలో అత్యధిక ఓటర్లు తమ సానుభూతిపరులవేనన్నది తృణమూల్ కాంగ్రెస్ వాదన. ముస్లిం మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్ తదితర సరిహద్దు జిల్లాల్లో ఈ తొలగింపులు ఎక్కువగా జరిగాయి. ఇవి టీఎంసీకి బలమైన కోటలు. 140 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య, గత ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు మెజారిటీ కన్నా ఎక్కువగా కావడంపై టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ కారణంగానే తాము ఓడిపోయామని అంటోంది.

పేదల ఓట్లు గల్లంతు..

మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోత టీఎంసీని దెబ్బకొట్టింది. గతంలో గంపగుత్తగా తృణమూల్‌కు పడే ఓట్లలో ఈ సారి చీలిక రావడం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక బంగ్లాదేశ్ నుండి వచ్చిన వలసదారులు తప్పుడు పత్రాలతో ఓట్లు పొందారని బీజేపీ మొదటి నుండి ఆరోపిస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నప్పటికీ, సరైన డాక్యుమెంట్లు సమర్పించలేకపోయిన లక్షలాది మంది మైనార్టీలు, పేదల ఓట్లు గల్లంతయ్యాయి. ఇది సరిహద్దు ప్రాంతాల్లో టీఎంసీ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టింది. గతంలో మైనార్టీ ఓట్లు గుత్తమొత్తంగా టీఎంసీకి పడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారడం టీఎంసీని గెలుపుపై ప్రభావం చూపింది.

Storey By: Anup Big Tv

Also read: బొక్క బోర్లా పడ్డ ఏక్జిట్ పోల్స్.. ప్రజాతీర్పుతో అంతా మైండ్ బ్లాక్.. అంచనాలను తలకిందులు చేసిన ఓటర్లు..!

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×