POCO X7 Pro 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో (POCO) తాజాగా POCO X7 సిరీస్ ను లాంఛ్ చేసింది. ఇందులో రెండు బెస్ట్ మిడ్ రేంజ్ మెుబైల్స్ ను తీసుకొచ్చింది. ఇక ఈ రోజు ఈ మెుబైల్స్ ఫస్ట్ సేల్ మెుదలైంది. మరి ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.
POCO జనవరి 9న POCO X7 5G, POCO X7 Pro 5G పేరుతో రెండు మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైమెన్సిటీ 8400 చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే తో పాటు మరెన్నో ఫీచర్స్ తో వచ్చేశాయి. ఇక ఈ రోజు POCO X7 Pro 5G ఫస్ట్ సేల్ మెుదలైంది. ఫ్లిప్కార్ట్ వేదికగా మొదలైన ఈ ఫస్ట్ సెల్ లో భారీ ఆఫర్స్ ను అందిస్తుంది పోకో. ఈ మొబైల్ పై డిస్కౌంట్స్ తో పాటు ఇన్స్టెంట్ తగ్గింపును సైతం అందిస్తోంది.
POCO X7 Pro 5G మెుబైల్ 8GB+256GB వేరియంట్ ధర రూ.27,999, 12GB+256GB వేరియంట్ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. ఇది ఎల్లో, నెబ్యులా గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్‌తో సహా మూడు రంగులలో అందుబాటులో ఉంది.
ఇక ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్స్ ను ప్రకటించడంతో అయితే POCO X7 5G 8GB+128GBకి రూ. 21,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.23,999కి అందుబాటులో ఉంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ తన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1250 తగ్గింపును కూడా అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌పై కస్టమర్లు 9 నెలల వరకు నో-కాస్ట్ EMI, రూ. 2000 తగ్గింపును కూడా పొందవచ్చు.
POCO X7 5G సిరీస్ స్పెసిఫికేషన్‌లు –
POCO X7 5G, POCO X7 Pro 5G వరుసగా డైమెన్సిటీ 7300, డైమెస్నిటీ 8400 చిప్‌సెట్ తో పనిచేస్తాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. POCO X7 ప్రో గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్ట్ అవుతుంది. అయితే X7 గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో పనిచేస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. POCO X7 Pro 5G 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 20MP ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది. అయితే POCO X7 5G మెుబైల్.. 2MP+50MP+8MPతో సహా ట్రిపుల్ కెమెరా సెన్సార్‌లతో వస్తుంది. సెల్ఫీల కోసం, POCO X7 5G 20MP ఫ్రంట్ కెమెరాతో అమర్చబడింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ బ్యాటరీ విషయానికి వస్తే.. POCO X7 5Gలో 5110mAh బ్యాటరీ, POCO X7 Pro 5Gలో 6550mAh బ్యాటరీ ఉన్నాయి . సో.. పోకో X7 సిరీస్ ఫీచర్స్ తో ధర సైతం అదిరేలా ఉంది. బెస్ట్ మిడ్ రేంజ్ మెుబైల్ కొనాలనుకుంటే తప్పుకుండా ట్రై చేయండి.
ALSO READ : ఊరిస్తున్న యాపిల్ ఫ్లిప్ మెుబైల్ ఫీచర్స్.. లాంఛ్ ఎప్పుడంటే!