E-Paper
Advertisement

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి
Advertisement

ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కేవలం గాలి కోసం మాత్రమే కాదు, ఇంటి వాతావరణంపై కూడా ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం ఫ్యాన్ పెట్టే దిశ, స్థానం, ఎత్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఫ్యాన్ సరిగా లేకపోతే ఇంట్లో ప్రశాంతత తగ్గుతుందని, ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుందని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో ఫ్యాన్ అమర్చేటప్పుడు కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

సీలింగ్ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి?
వాస్తు ప్రకారం ఫ్యాన్ గదిలో సరైన మధ్య భాగంలో ఉండటం మంచిదిగా భావిస్తారు. ఒక వైపుకు ఎక్కువగా అమర్చితే గాలి సమంగా తిరగదని, దీంతో గదిలో అసౌకర్యం పెరుగుతుందని అంటున్నారు. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో పడకకు సరిగ్గా పైభాగంలో భారీ ఫ్యాన్ ఉండటం కొందరికి మానసిక ఒత్తిడి కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే గదికి సరిపోయే పరిమాణంలో ఫ్యాన్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

సౌండ్ రాకూడదు
చాలామంది పాత ఫ్యాన్ నుంచి శబ్దం వస్తున్నా అలాగే వాడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం కిర్రు కిర్రు శబ్దం చేసే ఫ్యాన్ మంచిది కాదని నమ్మకం. ఇలాంటి శబ్దాలు ఇంట్లో ప్రశాంతత తగ్గిస్తాయని, నెగెటివ్ ఎనర్జీ పెంచుతాయని కొందరు చెబుతున్నారు. అలాగే దుమ్ము పట్టిన ఫ్యాన్ కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. ఫ్యాన్ రెగ్యులర్‌గా శుభ్రం చేస్తే గాలి కూడా బాగా వస్తుంది. ఇంటి వాతావరణం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది.

Also read: Frizzy hair: జుట్టు జిడ్డుగా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ ఇంటి చిట్కా పాటించండి చాలు

Advertisement

ఫ్యాన్ ఎత్తు కూడా చాలా ముఖ్యం అంటున్నారు. చాలా కిందగా ఉంటే అసౌకర్యం కలుగుతుంది. చాలా ఎత్తుగా ఉంటే గాలి సరిగా రాదు. అందుకే గది పరిమాణానికి తగ్గట్టుగా ఫ్యాన్ అమర్చాలని సూచిస్తున్నారు. చిన్న గదిలో చాలా పెద్ద ఫ్యాన్ పెడితే గది ఇరుకుగా కనిపించే అవకాశం ఉంటుంది. అదే పెద్ద గదిలో చిన్న ఫ్యాన్ పెడితే సరైన గాలి రాదు.

పూజా గదిలో ఫ్యాన్ పెట్టే విషయంలో కూడా కొందరు ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తుంటారు. దేవుడి ఫోటోలు లేదా దీపంపై నేరుగా గాలి పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఫ్యాన్ కింద పూజా సామగ్రి పెట్టకపోవడం మంచిదని అంటున్నారు. కొందరు డైనింగ్ టేబుల్‌కు సరిగ్గా పైభాగంలో ఫ్యాన్ పెట్టకూడదని కూడా నమ్ముతారు. ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంతత తగ్గుతుందని అంటున్నారు.

Also read: Ancient Grains: మొటిమలు రాకూడదంటే ఈ పురాతన ధాన్యాలు తప్పక తినాలి.. చర్మం గ్లో అవుతుంది

విరిగిన రెక్కల ఫ్యాన్
ఇక విరిగిన రెక్కలతో ఉన్న ఫ్యాన్‌ను ఇంట్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఫ్యాన్ ప్రమాదకరం కూడా కావచ్చు. అలాగే ఫ్యాన్ చాలా ఎక్కువగా కదిలినా వెంటనే రిపేర్ చేయించాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. పాత వైరింగ్ ఉన్న ఫ్యాన్‌ల వల్ల షార్ట్ సర్క్యూట్ సమస్యలు కూడా రావచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచడం, గాలి బాగా వచ్చేలా చూసుకోవడం, పాడైన వస్తువులు వెంటనే మార్చేయడం వంటి మంచి వాస్తు చిట్కాలు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే పరిశుభ్రత, సరైన వెలుతురు, గాలి చాలా ముఖ్యం అంటున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×