E-Paper
Advertisement

బొక్క బోర్లా పడ్డ ఏక్జిట్ పోల్స్.. ప్రజాతీర్పుతో అంతా మైండ్ బ్లాక్.. అంచనాలను తలకిందులు చేసిన ఓటర్లు..!

బొక్క బోర్లా పడ్డ ఏక్జిట్ పోల్స్.. ప్రజాతీర్పుతో అంతా మైండ్ బ్లాక్.. అంచనాలను తలకిందులు చేసిన ఓటర్లు..!
Advertisement

Exit Polls: ఎగ్జాక్ట్ రిజల్ట్స్ చూశాక.. ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా డిస్కషన్ మొదలైంది. ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయనే విషయంలో అంతా ఓ అంచనాకు వచ్చేలా చేసేవే ఎగ్జిట్ పోల్స్. మరి.. 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్‌లో.. ఏ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ నిజమైంది? తమిళనాడు విషయంలో బొక్క బోర్లా పడ్డ సర్వేలెన్ని? బెంగాల్ ఫలితాలకు దగ్గరగా ఉన్న అంచనాలేంటి? కేరళంలో యూడీఎఫ్ ప్రభంజనాన్ని పసిగట్టిందెవరు? ఎగ్జిట్ పోల్స్.. ఇప్పుడు కనిపిస్తున్న ఎగ్జాక్ట్ పోల్స్‌కు ఎంత దగ్గరగా ఉన్నాయ్?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు..

ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేముందు.. పొలిటికల్ సర్కిల్స్‌లోనూ, సామాన్య జనాల్లో జరిగే అతిపెద్ద చర్చ.. ఎగ్జిట్ పోల్స్. ఓటరు నాడిని పట్టుకోవడంలో కొన్ని సంస్థలు సక్సెస్ అయితే, మరికొన్ని ఘోరంగా విఫలమవుతుంటాయి. ముఖ్యంగా.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, అసలు ఫలితాలకు మధ్య ఉన్న గ్యాప్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాయ్. ఇక్కడ, దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బొక్క బోర్లా పడ్డాయ్. చాలా సంస్థలు.. మళ్లీ టీఎంసీదే అధికారమని చెప్పాయ్. కానీ, ఫలితాలు చూస్తే.. టీఎంసీ వంద సీట్లు కూడా గెలవలేకపోయింది. ప్రజా పోల్ అనే సంస్థ మాత్రమే.. టీఎంసీకి 85 నుంచి 110 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 178 నుంచి 208 స్థానాలు వస్తాయని చెప్పింది. ఈ ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగానే బెంగాల్ ఫలితాలున్నాయి.

Advertisement

Also Read: కొడుకుతో కలిసి.. ప్రియుడిని చంపిన మహిళ!

రిజల్ట్ మొత్తం రివర్స్..

తమిళనాడు విషంలో.. చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయ్. తప్పడమే కాదు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులయ్యాయ్. దాదాపుగా అన్ని సంస్థలు.. డీఎంకేనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశాయ్. మళ్లీ డీఎంకేనే అధికారం చేపడుతుందనేలా ఇచ్చాయ్. కొన్ని సంస్థలు డీఎంకే కూటమికి, ఇంకొన్ని అన్నాడీఎంకేకు ఎడ్జ్ ఉంటుందని చెప్పాయ్. కానీ.. రిజల్ట్ మొత్తం రివర్స్ అయింది. ఒక్క యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే తమిళనాడు విషయంలో నిజమైంది. విజయ్ టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆ లెక్క ప్రకారమే.. విజయ్ పార్టీ వంద సీట్ల మార్క్ దాటేసింది. డీఎంకే విషయంలో.. జేవీసీ సంస్థ అంచనాలు నిజమయ్యాయ్. అన్నాడీఎంకే విషయంలో అన్ని అంచనాలూ తప్పాయ్.

అంచనాలు తారుమారు..

Advertisement

కేరళ ఫలితాల విషయానికొస్తే.. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ దగ్గరగా ఉన్నాయ్. యూడీఎఫ్‌కు 78 నుంచి 90 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. కానీ.. యూడీఎఫ్ ఏకంగా సెంచరీ మార్క్ క్రాస్ చేసింది. ఎల్డీఎఫ్ విషయంలో అన్ని సంస్థల అంచనాలు తప్పాయ్. ఎల్డీఎఫ్ కూటమికి 50కి పైగా స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. కనీసం 40 లోపు స్థానాలు కూడా గెలవలేకపోయింది. ఇక.. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, పుదుచ్చేరిలోనూ ఎన్డీయే అధికారం నిలబెట్టుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయ్. ఇక్కడ సర్వేలన్నీ దాదాపుగా సక్సెస్ అయ్యాయ్. యాక్సిస్ మై ఇండియా, పోల్ డైరీ, జేవీసీ సంస్థలు.. అస్సాంలో బీజేపీ వంద స్థానాలు గెలవొచ్చని అంచనా వేసింది. అందుకు తగ్గట్లుగానే బీజేపీ సెంచరీ మార్క్ క్రాస్ చేసింది. పుదుచ్చేరిలో ఎన్డీయే మెజారిటీ మార్క్ 16 క్రాస్ చేస్తుందని.. యాక్సిస్ మై ఇండియా, పీపుల్స్ పల్స్, జేవీసీ, ప్రజా పోల్ అంచనా వేశాయ్. ఫలితాలు కూడా దగ్గరగానే వచ్చాయ్. బెంగాల్, తమిళనాడు, కేరళ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొంతవరకు తప్పినా.. అస్సాం, పుదుచ్చేరి విషయంలో మాత్రం నిజమయ్యాయ్. ఏదేమైనా.. ఎగ్జిట్ పోల్స్ కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా కౌంటింగ్ రోజుతోనే తేలిపోతుంది. ఇప్పుడు కూడా అదే మరోసారి రిపీటైంది.

Storey By: Appa Rao Big Tv

Also Read: చెన్నైలో సంచలనం.. మాజీ మంత్రిని మట్టికరిపించిన ఆటో డ్రైవర్..!

Related News

మృగశిర కార్తె అంటే ఏమిటి? ఆ రోజు చేపలు, రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

జాన్వీ కపూర్‌ను టార్గెట్ చేయొద్దు.. ‘పెద్ది’ ట్రోలింగ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!

మంత్రి గుమ్మడి సొంత ఏరియాలోనే ఇంత దౌర్భాగ్యమా.. ఆందోళనలో కార్మికులు..!

Hydra Remarks: సీఎం రేవంత్ రెడ్డి మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తెలంగాణ.. ఎమన్నారంటే..?

బొబ్బిలి వీణల లొల్లి లేపిన ఎమ్మెల్యే బేబీ నాయన.. అయిన కదలని అటవీ శాఖ ఫైళ్లు!

Youth Movement: బొద్దింకలు ఎప్పటికీ చావవు.. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దద్దరిల్లిన స్లోగన్స్!

Flex Fuel: ఇక పెట్రోల్‌కు బై బై చెప్పె రోజులొచ్చాయ్.. మార్కెట్లోకి హీరో ఫ్లెక్స్ బైకులు, మారుతీ కారు..!

అమెరికాలో భారతీయుల శకం ముగిసిందా? టెకీలను వెంటాడుతున్న కొత్త భయాలు!

Big Stories

Advertisement
×