BigTV English

The Flagpole : ధ్వజస్తంభం దారి చూపించడానికే పెట్టారా…..

The Flagpole : ధ్వజస్తంభం దారి చూపించడానికే పెట్టారా…..

The Flagpole : దేవాలయాల్లో దేవుడికే కాదు ధ్వజస్తంభానికి కూడా పూజలు చేస్తుంటాము.అదేవిధంగా ధ్వజస్తంభం పై భాగంలో దీపం పెడుతుంటాం. ధ్వజస్తంభాలు పెట్టే ఆచారం వెనక ఒక పురాణాగాథ ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తరువాత మయూరధ్వజుడు సింహాసనాన్ని అధిష్టించి అన్యాయాలకు తావులేకుండా ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాంచారు. తన కన్నా ఎవరు గొప్ప దాన పరులు లేరనిపించుకోడం కోసం విచ్చలవిడిగా దాన ధర్మాలు చేశాడు. ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని భావించాడు. పాండవులు, కృష్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యారు.యుద్ధం జరుగుతున్న సమయంలో పాండవులు సైన్యంతో హోరాహోరీగా పోరాడుతారు.


చివరికి కృష్ణుడు ధర్మరాజు వృద్ధ బ్రాహ్మణ వేషంలో మయూరధ్వజుడు దగ్గరకి వెళ్తారు. ఆ బ్రాహ్మణులకు ఏం కావాలో కోరుకోమని మయూరధ్వజుడు అడగగా అందుకు మీ శరీర సగ భాగం కావాలని అడుగగా అందుకే ఆ రాజు ఏ మాత్రం సంకోచించకుండా తన శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపి వరం కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాజు నేను మరణించినప్పుడు నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా దీవించండి అని అడగగా… అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు. నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభం ఉంటుంది. అక్కడికి వచ్చే భక్తులు మొదటగా నిన్ను ఆరాధించే ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ఎవరైతే నీ ఎదుట దీపారాధన చేస్తారో వారి జన్మ సఫలమవుతుందని వరమిస్తాడు. .అదే విధంగా ధ్వజస్తంభంపై దీపం పెట్టడం వల్ల ఆ దీపం రాత్రి సమయంలో బాటసారులకు వెలుగవుతుందని చెబుతాడు.

అప్పటి నుంచీ ప్రతి దేవాలయం ముందు దేవాలయంలోని విగ్రహానికి సమానంగా ధ్వజస్తంభానికి పూజలను నిర్వహిస్తారు.భక్తులు సైతం ఈ ఆలయంలోనికి ప్రవేశించే ముందు ధ్వజస్తంభానికి పూజించాలి.అదేవిధంగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు స్తంభానికి కూడా ప్రదక్షిణలు చేయడం వల్ల శుభం జరుగుతుంది.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×