BigTV English

Venkatesh Daggubati: వెంక‌టేష్ కోసం ముగ్గురు హీరోయిన్స్ వెతుకులాట‌

Venkatesh Daggubati: వెంక‌టేష్ కోసం ముగ్గురు హీరోయిన్స్ వెతుకులాట‌

Venkatesh Daggubati:సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్స్ వెత‌క‌టం అనేది ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌కు పెద్ద వ‌ర్క్ అనే చెప్పాలి. ఒక హీరోయిన్‌కే ఇలా ఉంటే ఓ కుర్ర ద‌ర్శ‌కుడు ఓ సీనియ‌ర్ స్టార్ కోసం ఏకంగా ముగ్గురు భామ‌ల‌ను సెట్ చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా!.. విక్ట‌రీ వెంక‌టేష్. ఆ కుర్ర ద‌ర్శ‌కుడు మ‌రేవ‌రో కాదు.. శైలేష్ కొల‌ను. ఈ మ‌ధ్య కాలంలో హిట్‌, హిట్ 2 వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌తో వ‌రుస హిట్స్ సాధించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను. త‌దుప‌రి ఈయ‌న హిట్ యూనివ‌ర్స్‌లోనే హిట్ 3 సినిమాను తెర‌కెక్కిస్తాడేమోన‌ని అంద‌రూ భావించారు. కానీ శైలేష్ విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సైంధ‌వ్ అనే పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి ఆ రేంజ్‌లో ఉండేలా హంగుల‌ను సిద్ధం చేస్తున్నార‌ట మ‌న డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను. ఇప్ప‌టికే బాలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ న‌వాజుద్దీన్ సిద్ధిఖీని ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. అలాగే కోలీవుడ్ హీరో ఆర్య కూడా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని కూడా టాక్‌. కాగా.. తాజాగా స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటార‌ట‌. అందులో ఒక‌రు బాలీవుడ్ హీరోయిన్ అని టాక్‌. మ‌రి ఆ హీరోయిన్స్ ఎవ‌ర‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

ఎఫ్ 3 సినిమా త‌ర్వాత వెంక‌టేష్ మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. ఓరి దేవుడా చిత్రంలో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చాడు. స‌ల్మాన్ ఖాన్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిదే. అలాగే రానా నాయుడు అనే నెట్ ఫ్లిక్స్ ఒరిజిన‌ల్‌లోనూ వెంకీ న‌టించారు. సైంధ‌వ్ సినిమాను ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×