BigTV English

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Jitiya Vrat 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జితీయ వ్రతం అనేది సనాతన ధర్మం యొక్క అత్యంత పుణ్యమైన, ఫలవంతమైన వ్రతంగా చెబుతారు. మహిళలు ఈ వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ వ్రతం ఆచరించడం వల్ల సంతానం కలుగుతుంది. తల్లులు తమ పిల్లల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం కోసం కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రదేశాలలో జితీయ వ్రతాన్ని జీవితపుత్రిక వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు.


జితియా ఉపవాసం ఆశ్విన్ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజు ఆచరిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 24న జితీయా వ్రతం ఆచరించాలి. మరి జితీయ వ్రతం ఆచరించడాని శుభ సమయం, ప్రాముఖ్యత గురించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జితీయ వ్రత నక్షత్రం..


సెప్టెంబర్ 25న పునర్వసు నక్షత్రంలో జితీయా ఉపవాసం ఉంటారు. ఈ రోజు ఉపవాసం చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. సెప్టెంబరు 25న అంటే బుధవారం సాయంత్రం జితీయ లక్ష్మీదేవికి పూజ చేయాలి. దీనికి శుభ సమయం సాయంత్రం 4:40 నుండి 5:33 వరకు. ఈ సమయంలో దేవతలను మన ఆచారాల ప్రకారం పూజించవచ్చు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 26 ఉదయం 4.35 నుండి 5.23 మధ్య కాలంలో ఉపవాసాన్ని ముగించాలి.

జితీయ వ్రతం శుభ తేదీ..

పునర్వసు నక్షత్రం సెప్టెంబర్ 25న వస్తుంది. అందుకే ఈ రోజు ఉపవాసం చాలా శుభప్రదంగా చెబుతుంటారు. బుధవారం సాయంత్రం 04.04 నుండి 05.33 గంటల వరకు జితీయ పూజ సమయం. ఈ వ్రతంలో జీమూతవాహనుని పూజిస్తారు.

ఈ రోజున అమ్మవారికి నిర్జల వ్రతం ఆచరించి మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమిస్తారు. ఈ సంవత్సరం, సెప్టెంబర్ 26న ఉదయం 04:35 నుండి 05:23 వరకు ఉపవాసం విరమించవచ్చు. ఒక సారి ఈ వ్రతం ఆచరిస్తే ప్రతి సంవత్సరం పాటించాలి. మధ్యలోనే వదిలేయకూడదు.

Also Read: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

జితీయ వ్రతం యొక్క ప్రాముఖ్యత..

మత విశ్వాసాల ప్రకారం, జితీయ వ్రతం రోజున ఉపవాసం చేయడం వల్ల సంతానం కలుగుతుంది. పిల్లల ఆయుష్షు కూడా పెరుగుతుంది. కెరీర్‌లో కూడా ఎదుగుదల ఉంటుంది. ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అంతే కాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×