BigTV English

Jayam Ravi : జయం రవితో ఎఫైర్ పై ప్రశ్న… నెటిజన్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సింగర్

Jayam Ravi : జయం రవితో ఎఫైర్ పై ప్రశ్న… నెటిజన్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సింగర్

Jayam Ravi : కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టుగా ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించారు జయం రవి. ఆయన ఓ సింగర్ తో ఎఫైర్ నడుపుతున్న కారణంగానే భార్య భర్తలు ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే జయం రవి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సదరు గాయని ఈ విషయంపై ఎట్టకేలకు మౌనాన్ని వీడి సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి జయం రవి గురించి వేసిన ప్రశ్నపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ రిప్లై ఇచ్చింది.


గోవా సింగర్ తో జయం రవి ఎఫైర్

కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆర్తి రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా రోజులుగా వీరిద్దరూ డివోర్స్ తీసుకోబోతున్నారు అంటూ రూమర్లు చక్కర్లు కొట్టగా, వాటిని కొట్టి పారేస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు రీసెంట్ గా తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ జయం రవి సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చాడు. వెంటనే వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా, గోవా సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో జయం రవికి ఉన్న ఎఫైర్ కారణమని వార్త బయటకు వచ్చింది. దీంతో చాలామంది నెటిజెన్లు ఇంస్టాగ్రామ్ లో కెనిషాపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ జయం రవి మీతో క్షేమంగా ఉన్నారా అంటూ సెటైరికల్ గా ప్రశ్నించాడు. దానికి కెనిషా సమాధానం ఇస్తూ “మీరు మీ తల్లిదండ్రులతో సురక్షితంగా ఉన్నారా? మీరు మీతో, మీ ఇన్ సెక్యూరిటీలతో సురక్షితంగా ఉన్నారా ? ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న స్నేహితులందరితో మీరు సురక్షితంగా ఉన్నారా? ముందుగా మీరు ఇతరులకు సురక్షితమైన వ్యక్తిగా ఉన్నారా? నేను మీకు శాంతి, ప్రేమ కలగాలని కోరుకుంటున్నాను” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Kenishaa Francis reacts to comment asking about her secret affair with Jayam Ravi

కెనిషా, జయం రవి రిలేషన్ నిజమేనా?

అయితే కెనిషాతో రిలేషన్ షిప్ గురించి వస్తున్న వార్తలపై జయం రవి ఇప్పటిదాకా స్పందించలేదు. ఇద్దరూ ఒకరితో ఒకరు రహస్యంగా డేట్ చేస్తున్నారని, ఈ విషయం తెలిసిన ఆర్తి రవి షాక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కెనిషాతో పాటు రైడ్ కి వెళ్లిన జయం రవి ఓవర్ స్పీడ్ కారణంగా గోవా పోలీసులకు చిక్కారని, అక్కడ జరిమానా కూడా కట్టాల్సి వచ్చిందని, ఈ విషయం తెలిసిన ఆర్తి రవి భర్తతో గొడవ పెట్టుకుందని టాక్ నడుస్తోంది. తమ 14వ వార్షికోత్సవం సందర్భంగా జయం రవి తన భార్య ఆర్తితో కాకుండా కెనిషాతో కలిసి గోవాలో గడిపాడని వార్తలు వచ్చాయి. పైగా ఇద్దరూ కలిసి అక్కడ ఓ బంగ్లాన్ని కూడా కొన్నారట. గోవా పర్యటనలోనే జయం రవికి కెనిషా కలిసిందని తెలుస్తోంది. కాగా కెనిషా అనే సింగర్ బెంగళూరుకు చెందిన అమ్మాయి. గోవాలో వివిధ పబ్బులలో ఇండిపెండెంట్ సింగర్ గా పాపులర్. అంతేకాకుండా జీవాతో కలిసి మ్యూజిక్ ఆల్బమ్స్, పలు సినిమాలకు కూడా పని చేసింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×