TDP vs YCP: విజయనగరం జిల్లాలో దుర్గాదేవి నిమజ్జనోత్సవం సందర్భంగా ఉద్రిక్తత చెలరేగింది. జమ్మూ గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పండుగ వాతావరణం క్షణాల్లో గందరగోళం నెలకొంది.
ఘర్షణకు కారణం
స్థానిక సమాచారం ప్రకారం, జమ్మూ గ్రామంలో రెండు వర్గాలు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను వేర్వేరుగా నిర్వహించాయి. నిమజ్జనం కోసం వెళ్లినప్పుడు మా విగ్రహం ముందుగా నిమజ్జనం కావాలి అంటూ.. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. కొద్దిసేపటిలోనే వాగ్వాదం దాడులకు దారి తీసింది.
టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు వ్యక్తులు గాయపడగా, స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని నియంత్రించారు.
పోలీసులు జోక్యం
ఘటన సమాచారం అందుకున్న వెంటనే.. జమ్మూ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు నేతృత్వంలోని బృందం అక్కడికి చేరుకుంది. పోలీసులు రెండు వర్గాలను వేరు చేశారు. గాయపడిన వారిలో హోమ్ గార్డ్ సురేశ్ కూడా ఉన్నారు.
వివరాల ప్రకారం, వాగ్వాదం సమయంలో వైసీపీ కార్యకర్తలు హోమ్ గార్డ్ సురేశ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఉద్రిక్తత ఒక్కసారిగా మరింత పెరిగింది.
ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్త ఆనంద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. చితకబాదినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
రాజకీయ వాతావరణం వేడెక్కింది
టీడీపీ నాయకులు పోలీసుల చర్యలను సమర్థించగా, వైసీపీ నేతలు తమ కార్యకర్తలపై అనవసరంగా దాడి చేశారని ఆరోపించారు.
అదే సమయంలో విజయనగరం జిల్లా జడ్పీటీసీ చైర్మన్ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త ఆనంద్‌ను పరామర్శించారు.
గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత
ఘర్షణ తరువాత జమ్మూ గ్రామంలో అదనపు పోలీసులు మోహరించారు. సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పలు చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ఎటువంటి అనూహ్య ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.
Also Read: తల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు..
అధికారులు, ప్రజాప్రతినిధుల స్పందన
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర నివేదిక కోరారు. “రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.