BigTV English

Galaxy A35 5G: గెలాక్సీ A35 5Gపై భారీ తగ్గింపు.. రూ.16000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

Galaxy A35 5G: గెలాక్సీ A35 5Gపై భారీ తగ్గింపు.. రూ.16000 డిస్కౌంట్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే

Galaxy A35 5G Discount| ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇటీవలే ముగిసింది. అయితే శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్‌ పై ఇప్పటికీ రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ.. ఇది ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్, 120 Hz సూపర్ AMOLED డిస్ప్లే, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000 mAh బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఫోన్ వస్తుంది.


ధర, ఎక్స్ఛేంజ్ ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్‌ను భారతదేశంలో రూ.33,999 ధరకు లాంచ్ చేశారు. ఇప్పుడు 47 శాతం డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.17,999కు కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.16,000 తగ్గింపు. మీ వద్ద పాత ఫోన్ ఉంటే, మీరు రూ.17,340 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. గరిష్ఠంగా సేవింగ్స్ పొందడానికి మీ పాత ఫోన్ మంచి కండిషన్‌లో ఉండాలి. కానీ ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే.

డిస్ప్లే, డిజైన్

ఈ ఫోన్‌లో 6.6-ఇంచ్ FHD+ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే కచ్చితమైన కలర్స్, కాంట్రాస్ట్‌తో ఇమ్మర్సివ్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండడం వలన బయటి ప్రదేశాలలో కూడా దృశ్యమానత చాలా బాగా ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ మీకు సున్నితమైన స్క్రోలింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఫోన్ ప్రీమియం డిజైన్‌తో వస్తుంది, ఇందులో ఎలిగెంట్ గ్లాస్ బ్యాక్, ఫ్లాట్ సైడ్ ఫ్రేమ్ ఉంటాయి. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. మీరు ఈ ఫోన్‌ను ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ, ఆసమ్ లైలాక్, ఆసమ్ లెమన్ వంటి రంగు ఎంపికలలో పొందవచ్చు.


పెర్ఫార్మెన్స్

శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్‌ లో పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ఉంటుంది. ఇది 5nm ప్రాసెస్‌లో నిర్మించబడింది. రోజువారీ వినియోగానికి, హెవీ గేమింగ్‌లో ఈ ఫోన్ చాలా మంచి పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను 6 GB లేదా 8 GB RAM, 128 GB లేదా 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పొందవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఫోన్ Android 14, శాంసంగ్ వన్ UI 6.1తో రన్ అవుతుంది. శాంసంగ్ ఈ ఫోన్‌తో 4 జనరేషన్ల Android OS అప్‌గ్రేడ్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను హామీ ఇస్తుంది.

కెమెరా సెటప్, బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్‌లో వెనుక భాగంలో వెర్సటైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో f/1.8 అపర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 MP వైడ్-యాంగిల్ లెన్స్, 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5 MP మేక్రో లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ కెమెరాల సహాయంతో మీరు UHD 4K రిజల్యూషన్‌లో 30 ఫ్రేమ్స్ పర్ సెకన్దర వద్ద రికార్డ్ చేయవచ్చు. మెరుగైన సెన్సర్, ఎన్‌హాన్స్డ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ రాత్రి సమయంలో కూడా స్పష్టమైన, వివరణాత్మక ఫోటోలను క్యాప్చర్ చేయడానికి సహాయపడతాయి.

శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్‌లో 5000 mAH బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది ఒకే ఛార్జీలో సులభంగా 2 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జ్ చేయవచ్చు. అయితే, బాక్స్‌లో ఛార్జర్ ఉండదు కాబట్టి.. మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి.

Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

Related News

iPhone 17 Dual Camera: ఐఫోన్ 17లో అద్భుత ఫీచర్.. ఒకేసారి ముందు వెనుక కెమెరాలతో వీడియో రికార్డింగ్

Babies Without Pregnancy: గర్భం దాల్చకుండానే బిడ్డకు జన్మనివ్వచ్చు! పరిశోధనలో షాకింగ్ విషయాలు

Comet Browser: గూగుల్‌‌కే చెమటలు పట్టిస్తున్న ఈ అరవింద్ శ్రీనివాస్ ఎవరో తెలుసా? ఇదే భారతీయుడి పవర్!

Tablet Comparison: రెడ్మీ ప్యాడ్ 2 ప్రో vs వన్‌ప్లస్ ప్యాడ్ 3 vs శాంసంగ్ ట్యాబ్ S10 FE.. ఏ ట్యాబ్లెట్ బెస్ట్?

iPhone 16 Plus: ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ తగ్గింపు.. రూ.10000 కంటే ఎక్కువ డిస్కౌంట్.. ఎలా పొందాలంటే?

AI Dream Recorder: నిద్రలో వచ్చే కలలను వీడియోలుగా మార్చకోవచ్చు.. ఈ ఏఐ డివైజ్ గురించి తెలుసా?

Snapchat Memories: యూజర్లకు షాక్ ఇచ్చిన స్నాప్‌చాట్.. మెమొరీస్ స్టోరేజ్ ఇకపై ఫ్రీ కాదు

Big Stories

×