Tollywood: ఈ మధ్యకాలంలో చాలామంది స్నేహితులు గెట్ టు గెదర్ అనే పేరుతో రీ యూనియన్ గా ఏర్పడి అప్పటి వాళ్ల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలామంది టెన్త్, ఇంటర్ చదివి 15 ఏళ్లు, 20ఏళ్లు, 25 ఏళ్లు పూర్తయిన తర్వాత మళ్ళీ గెట్ టూ గెదర్ పార్టీని ఏర్పాటు చేసుకొని.. తమ మునపటి జ్ఞాపకాలను, ఫన్నీ సంఘటనలను నెమరు వేసుకుంటున్నారు. అయితే ఇది కేవలం స్కూల్స్,కాలేజ్ వాళ్లే కాదు సినిమాల్లో స్టార్స్ కూడా స్టార్ట్ చేశారు.. గత కొద్దిరోజుల నుండి దక్షిణాది ఇండస్ట్రీలో 1980వ దశకంలో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ఎంతోమంది అగ్ర నటీనటులు రీ యూనియన్ పేరుతో ఒకే చోట కలుస్తున్నారు.
అయితే తాజాగా మరోసారి 80 దశకంలో వెండితెరని ఏలిన సెలెబ్రెటీలు రీ యూనియన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో ఆ ఫోటోలు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. విషయంలోకి వెళ్తే.. 1980వ సంవత్సరంలో ఇండస్ట్రీని ఏలిన చాలామంది నటీనటులు రీ యూనియన్ పేరుతో చెన్నైలో ఒకే చోట కలుసుకున్నారు. ఇందులో అగ్ర హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా వచ్చి పార్టీలో ఎంజాయ్ చేశారు.. అయితే ఈ పార్టీలో అందరూ చిరుత థీమ్ ఎంచుకొని.. చీతా ప్రింట్స్ ఉన్న డ్రెస్సుల్లోనే మెరవడం హైలెట్ గా నిలిచింది.
ఇక ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు అంటే.. చిరంజీవి, వెంకటేష్, శరత్ కుమార్, జాకీ ష్రాఫ్, సుహాసిని, నరేష్, జయసుధ, రాధా, సుమలత, ప్రభు, మీనా, కుష్బూ, నదియా, రాజ్ కుమార్ సేతుపతి,శోభన, రమ్యకృష్ణ,హరీష్ ఇలా మొత్తం 31 మంది సెలబ్రిటీలు అక్టోబర్ 4 చెన్నైలోని రీ యూనియన్ పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అంతేకాదు ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా పెట్టారు. “1980లోని నా ప్రియమైన స్నేహితులతో కలిసి చేసుకునే ప్రతి ఒక్క రీ యూనియన్ ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎన్నో నవ్వులు, ఆనంద క్షణాలతో ఈ ఈవెంట్ చాలా అద్భుతంగా ఆనందంగా సాగింది.ఈ ఈవెంట్ ఎన్నిసార్లు చేసినా మొదటిసారి లాగే అనిపిస్తుంది” అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు.
ALSO READ:Hero Suhas: సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.. భారీగా నష్టం!
ప్రస్తుతం 80వ దశకం తారలందరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ రీ యూనియన్ ఆలోచన ఎలా స్టార్ట్ అయింది అంటే.. 2009వ సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో లిస్సీ, సుహాసిని ఇద్దరు ఓ చిన్న చర్చ కోసం ఒకే దగ్గర కలిశారు. ఆ సమయంలోనే ఈ ప్రతిష్టాత్మక రీ యూనియన్ ఆలోచన వచ్చిందట. అలా అప్పటి నుండి 1980వ దశకంలో సౌత్ ఇండస్ట్రీలో రాణించిన హీరో హీరోయిన్లు ఇలా రీ యూనియన్ ఏర్పరచుకుంటూ తమ మధ్య ఉన్న స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఏదేమైనా తాజాగా ఇప్పుడు 80వ దశకానికి సంబంధించిన సెలబ్రిటీలందరూ ఒకే చోట చేరి ఆ ఫోటోలను పంచుకోవడంతో..” పిక్ అప్ ది డే”.. ” రెండు కళ్ళు చాలడం లేదు” అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
The much-loved 80s Stars Reunion, a cherished annual tradition among South Indian film industry stalwarts, was held in Chennai on October 4th, 2025, marking a heartfelt return after three years.#80sStarsReunion #Reunion #Kollywood #Tollywood #Mollywood #Sandalwood #Bollywood pic.twitter.com/ppM7rrXizc
— BIG TV Cinema (@BigtvCinema) October 5, 2025