E-Paper
Advertisement

Ajit Agarkar: రోహిత్‌, కోహ్లీని 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడనిచ్చేదే లేదు…అగార్క‌ర్ బ‌లుపు మాట‌లు !

Ajit Agarkar: రోహిత్‌, కోహ్లీని 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడనిచ్చేదే లేదు…అగార్క‌ర్ బ‌లుపు మాట‌లు !
Advertisement

Ajit Agarkar:  టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్‌. 2027 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఆడేది కష్టమే అన్నట్లుగా ఆయన మాట్లాడారు. వాళ్లు సరిగ్గా ఆడితేనే తీసుకుంటామని.. లేకపోతే వాళ్లను తీసుకోవడం కష్టమే అన్నట్లుగా అజిత్ అగార్క‌ర్‌ వ్యాఖ్యానించారు. దీంతో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్క‌ర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోద‌రి పెళ్లి చూసిన అభిషేక్ శ‌ర్మ

రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించిన బీసీసీఐ

Advertisement

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును ప్రకటించారు అజిత్ అగార్కర్. ప్రెస్ మీట్ పెట్టి మరి జట్టును ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మకు ఊహించని షాక్ తగిలింది. వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి, గిల్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే టీ20 లు అలాగే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ… వన్డేలకు కూడా ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక అటు ఆస్ట్రేలియా టూర్ కోసం ప్రకటించిన జట్టులో సాధారణ ప్లేయర్లుగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సంజు ను వన్డేలకు సెలెక్ట్ చేయలేదు. దీంతో బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీని అంతటికి కారణం అజిత్ అగార్కర్ అలాగే గౌతమ్ గంభీర్ అంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు. పెద్దగా ఆట తెలియని హర్షిత్ రాణాకు మూడు ఫార్మాట్ లో అవకాశాలు ఇస్తున్నారని చురకలు అంటిస్తున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పై అజిత్ అగార్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertisement

టీమిండియా జట్టును ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వన్డే వరల్డ్ కప్ లో ఉంటారా? లేదా? అని రిపోర్టర్లు ప్రశ్నిస్తే టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే వాళ్ళిద్దరు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ఆడతారని తాను చెప్పబోనని వెల్లడించారు. వాళ్లు భవిష్యత్తులో ఆట తీరు మెరుగుపరుచుకుంటే కచ్చితంగా జట్టులో ఉంటారని వివరించారు. లేకపోతే వాళ్లు జ‌ట్టులో ఉండడం కష్టమేనని తెలిపారు. వయసు రిత్యా వాళ్ళ ఆట తీరు తగ్గే ఛాన్స్ ఉంటుందని కూడా ఎద్దేవా చేశారు. కాగా 2027 వరల్డ్ కప్ సమయానికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుతుండగా విరాట్ కోహ్లీ వయసు 38 సంవత్సరాలకు చేరుతుంది. అందుకే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వీళ్ళిద్దరూ వ‌న్డే వరల్డ్ కప్ ఆడ బోరని మరికొంతమంది అంటున్నారు. అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.

Also Read: Dhruv Jurel: 5 ఏళ్లకే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ, గోల్డ్ చైన్ తాక‌ట్టు పెట్టిన త‌ల్లి..జురెల్ జీవితాన్ని మార్చేసిన బ‌స్సు ప్ర‌మాదం !

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×