ఆధునిక జీవితంలో అలసట, ఒత్తిడి పెరిగిపోయింది. జీవితం అసౌకర్యంగా అనిపిస్తుంది. దాన్ని మరింత సరళంగా, ఆనందంగా మార్చుకోవడం కోసం మీ వేళ్ళను ప్రతిరోజూ మసాజ్ చేసుకోవాలి. సైన్స్ పరంగా, ఆయుర్వేద పరంగా కూడా వేళ్లను మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిరూపణ జరిగింది. ఇది మానసిక, భావోద్వేగ స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చేతికున్న వేళ్ళల్లో ఒక్కోదాన్ని మసాజ్ చేయడం వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్కో వేలికి శరీరంలోని ఒక్కో ఆరోగ్య వ్యవస్థతో సంబంధం ఉంటుంది.
బొటన వేలు
బొటనవేలును జాగ్రత్తగా మసాజ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ, మెదడు పనితీరు సానుకూలంగా మారుతుంది. తలనొప్పి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మానసిక అలసట కూడా తగ్గిపోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది ప్రోడక్టివిటీని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.
చూపుడు వేలు
ఈ వేలు మసాజ్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు ఎంతో మెరుగుపడుతుంది. చూపుడు వేలును మసాజ్ చేయడం వల్ల పొట్ట, పేగుల సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అసౌకర్యం కూడా చాలా తగ్గుతుంది. జీర్ణ క్రియ శక్తి పెరగడం, బరువు తగ్గడం వంటివన్నీ కూడా ఈ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు. బరువు తగ్గాలనుకున్నవారు చూపుడువేలును ప్రతిరోజు మసాజ్ చేసుకునేందుకు ప్రయత్నించండి.
మధ్య వేలు
అన్నిటికంటే పొడవుగా ఉండే మధ్య వేలు మసాజ్ చేయడం వల్ల పేగుల పనితీరు మెరుగు పడుతుంది. ఈ మధ్య వేలును మసాజ్ చేస్తూ ఉండటం వల్ల శరీరంలోని విషాలు బయటకు పోతాయి. పేగులలో నొప్పి, అసౌకర్యము తగ్గుతుంది. శరీరపు శక్తి కూడా పెరుగుతుంది.
ఉంగరపు వేలు
ఉంగరాన్ని ధరించే నాలుగో వేలుకు ప్రధానమైన విధి కాలేయానికి సహాయం చేయడం. ప్రతిరోజు ఈ వేలిని మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. కాలేయ కణాలు కూడా సక్రియమవుతాయి. హానికరమైన పదార్థాలను వేగంగా వదిలించుకోవడానికి ఇది సహాయపడుతుందిజ చర్మం కూడా పరిశుభ్రంగా ఉంటుంది.
చిటికెన వేలు
అన్నిటికంటే చిన్నదైనా చిటికెన వేలు మసాజ్ చేయడం వల్ల గుండె కండరాలు బలోపేతం అవుతాయి. రక్తపోటు స్థిరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. నిద, మానసిక ప్రశాంతత వంటివి కూడా కలుగుతాయి.
ప్రతిరోజు మీ అయిదు వేళ్లకు మసాజ్ చేసుకుంటూ ఉండటం వల్ల శరీరంలో ఆరోగ్యపరంగా ఎంతో మార్పు కనిపిస్తుంది. వేళ్ళకు క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల అంతర్గత అవయవాలు పనితీరు మెరుగుపడుతుంది. ఒత్తిడి, అలసట, రక్త ప్రసరణ సమస్యలు కూడా తొలగిపోతాయి.