BigTV English

Karthika Masam 2023 : శివకేశవ ప్రియం.. కార్తీకం..!

Karthika Masam 2023 : శివకేశవ ప్రియం.. కార్తీకం..!
Karthika Masam 2023

Karthika Masam 2023 : నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. చంద్రుడు.. కృత్తికా నక్షత్రంతో కూడి ఉండటం చేత దీనికి కార్తీకం అనే పేరు వచ్చింది. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణువుకు సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తము, గంగకంటే పుణ్య తీర్థము లేవని పురాణ వచనం.


కార్తీక మాసము శివ కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసము. ఇది పుణ్యస్నానాలకు, వివిధ వ్రతములకు అత్యంత శుభప్రదమైనది. ఈ నెలలో ఒంటిపూట భోజనం, సాయంత్రం వేళ తులసి వద్ద దీపాలు వెలిగించటం ఎంతో పుణ్యప్రదమని, అలా దీపాలు వెలిగించలేని వారు.. ఆరిన దీపాలు వెలిగించినా, దీపాలు ఆరిపోకుండా చేతి అడ్డుగా పెట్టినా మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం లేదా ఏదైనా జలాశయంలో స్నానం, బిల్వపత్రాలతో శివుని అర్చన, అభిషేకం, సాయంత్రం దీపారాధన చేస్తారు. అలాగే ఈ మాసంలో ‘కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం చొప్పున పారాయణం చేయటం విశేష ఫలితాన్నిస్తుంది.


కార్తీక మాసం తొలిరోజు సాయంత్రం నుంచే దేవాలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపానికి నమస్కరించి, శివాలయంలో దీపారాధన చేసినవారికి మరుజన్మ ఉండదని శాస్త్రవచనం. ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి, ఉత్థానైకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి వంటి దినాలు శివ,కేశవ అర్చనకు ఎంతో ప్రశస్తమైనవి.

Related News

Friday Rituals: శుక్రవారం రోజు పొరపాటున కూడా.. ఈ పనులు చేయకండి

Navratri: నవరాత్రుల సమయంలో ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయ్ !

Elaichi Mala: యాలకుల మాల శక్తి.. అప్పులు తొలగించే ఆధ్యాత్మిక పరిష్కారం

God Rules: పుట్టిన నెలను బట్టి.. ఏ దేవుడి ఆశీర్వాదం మీపై ఉంటుందో తెలుసా ?

Hindu Gods: ఏ దేవతలు.. ఎవరిని సంహరించారో తెలుసా ?

Tirumala Naivedyam: తిరుమల శ్రీవారికి నైవేద్యం ఎలా సమర్పిస్తారో తెలుసా..? ఏ దేవుడికి అలాంటి నైవేద్యం పెట్టరేమో..?

Navratri 2025: దేవీ నవరాత్రుల సమయంలో.. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు !

Navratri 2025: నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం, విశిష్టత ఏమిటి ?

Big Stories

×