
Nampally Fire Accident : అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి బజార్ ఘాట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కార్ గ్యారేజ్ లో ప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పొగ .. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.. ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమయ్యేలోపే ఏడుగురి ప్రాణాలు పోయాయి. ఎటు వెళ్లాలో తెలియక.. ఏం చేయాలో అర్థంకాక అపార్ట్‌మెంట్ వాసులు కాసేపు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు . ఆ దవానాలం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని కబలించింది.
బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుంది. స్థానికులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మంటలను అదుపు చేస్తూనే అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మెట్ల మార్గంలో మంటలు చెలరేగుతుండటంతో.. చిన్న పిల్లలు, మహిళలను కిటికీల గుండా బయటికి తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్స్ మొత్తం 15 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి.
అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇంత భారీ స్థాయిలో మంటలు ఎందుకు చెలరేగాయి? రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోకి కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి మంటలు అంటుకోవడానికి కారణాలేంటి? అంత భారీ స్థాయిలో మంటలు చెలరేగే కెమికల్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోకి ఎలా వచ్చాయి? ప్రస్తుతానికి అన్ని ప్రశ్నలే.. సమాధానాలు చెప్పాల్సిన అధికారులు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కూడా అధికారులకు క్లారిటీ లేదు . ఒకరేమో కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయి.. ఆ నిప్పు రవ్వలు డీజిల్ ట్యాంక్‌లపై పడటంతో భారీగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. మరోకరు ఫైబర్ షీట్స్ తయారీలో వాడే కెమికల్స్ అంటున్నారు. ఇంకొకరేమో కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ అంటున్నారు. ఈ మూడింటిలో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ గ్యారేజ్ నుంచే అయితే అసలు గ్యారేజ్ అనుమతి తీసుకునే నిర్వహిస్తున్నారా.. అనుమతులు లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారు.. కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ అయితే ఆ సెల్లార్‌లోకి ఎలా వచ్చాయి..
ప్రాణాలు పోతే కానీ అధికారులు మేల్కోరా?
Rahul Gandhi : మేడిగడ్డ బ్యారేజ్ రాహుల్ సందర్శన.. పోలీసుల ఆంక్షలు..