BigTV English

Meaning of Marriage : అగ్ని సాక్షిగా పెళ్లి వెనుక ఉన్న అర్థం

Meaning of Marriage : అగ్ని సాక్షిగా పెళ్లి వెనుక ఉన్న అర్థం
Marriage

Meaning of Marriage : అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నీ బాధ్యతని ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ వహించారు . ఇహ నాల్గవ వానిగా ఇప్పుడు నేను నీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను అని అర్థం.


అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు చల్లనివాడు . చక్కనివాడు . అవే లక్షణాలు పసిపాయిలోనూ కనిపించడానికి కారణం చంద్రుని పాలనే . నిండు చంద్రుణ్ణి ఎంత చూసినా తనివి తీరుతుందా ? అలానే పసిపాపను చూసినప్పుడు మనసుకి ఆ వెన్నెలలోని స్వచ్ఛతే అనుభవమవుతుంది . కొంత వయసు వచ్చాక ఆమె బాధ్యతని గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు.

ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా, గంధర్వుడు స్వీకరించాడన్నమాట .గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని ఆ కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు.


ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. ఆమె శరీరంలోకి కామ గుణాన్ని ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇక కళ్యాణానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన వరుడుకి ఇస్తాడు. అలా ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు.

Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×