ఇండియన్ టెలికాం మార్కెట్ లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో రిలయన్స్ జియో ఆరు సరసమైన సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.189 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్లాన్లు.. వాయిస్ కాల్స్ నుంచి మొదలుకొని డేటా, లాంగ్ వ్యాలిడిటీ, డిజిటల్ ప్రయోజనాలను అందిస్తోంది. కనెక్టివిటీతో పాటు జియో టీవీ, JioAICloud, Google Gemini Pro యాక్సెస్ అందించనున్నట్లు జియో వెల్లడించింది. AI, క్లౌడ్ ఆధారిత సేవలను మొబైల్ రంగానికి నేరుగా అనుసంధానించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. నవంబర్ 2025 ఎడిషన్ లో భాగంగా జియో అందుబాటులోకి తీసుకొచ్చిన చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 189 ప్లాన్ జియో చీప్ ప్లాన్. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, 300 SMSలు, 2GB డేటాను అందిస్తుంది. 28 రోజుల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది.. హై స్పీడ్ డేటా పరిమితి అయిపోయిన తర్వాత, నెట్ స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. ఎంటర్ టైన్ మెంట్, స్టోరేజ్ కోసం వినియోగదారులు JioTV, JioAICloudకి యాక్సెస్ పొందుతారు.
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB డేటా లాంటి బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. రోజువారీ డేటా అయిపోయిన తర్వాత నెట్ వేగం 64 Kbpsకి తగ్గించబడుతుంది. ఇది జియోటీవీ, జియో ఏఐక్లౌడ్ యాక్సెస్ ను పొందుతుంది.
రూ. 355 ఫ్రీడమ్ ప్లాన్ అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, 30 రోజుల వ్యాలిడిటీ, 25GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ జియో స్పెషల్ ఆఫర్ ప్రోగ్రామ్ కిందికి వస్తుంది. అదనపు డిజిటల్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. కొత్త వినియోగదారులకు జియోహోమ్ 2 నెలల ఉచిత ట్రయల్ లభిస్తుంది. 3 నెలలకు జియో హాట్ స్టార్ మొబైల్/టీవీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఉచిత 50GB జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులకు 18 నెలల గూగుల్ జెమిని ఆఫర్ లభిస్తోంది.
Read Also: రిలీజ్ కు రెడీ అయిన వన్ ప్లస్ 15.. స్పెసిఫికేషన్లు చూస్తే షాకవ్వాల్సిందే!
జియో రూ. 448 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్, 1,000 SMS, JioTV, JioAICloud యాక్సెస్ లభిస్తుంది.
జియో రూ. 1,748 ప్లాన్ ఏడాది వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. అపరిమిత వాయిస్, 3,600 SMSలు, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ ఆప్షన్ ను కలిగి ఉంటుంది.
ఈ సరసమైన స్వల్పకాలిక ప్లాన్ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఇది 14 రోజుల వరకు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో JioTV, JioAICloud సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి.
Read Also: Spotify సాంగ్స్ నేరుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఎలాగంటే?