హిందూమతంలో శని దేవుడు ముఖ్యమైన వాడు. ఆయన కర్మ ఫలితాన్ని అందిస్తాడు. న్యాయానికి అధిపతి. మనం చేసే పనుల ద్వారా ప్రతిఫలాన్ని అందించే దేవుడు. అందుకే ఆయనంటే ఎంతో మంది భయపడతారు. కానీ నిజానికి స్వచ్ఛమైన హృదయంతో పూజిస్తే ఇతరులకు సహాయం చేసే దేవుడు శని దేవుడు. అతడిని శాంతి చేసుకుంటే చాలు… ప్రత్యేక ఆశీర్వాదాలు పొందవచ్చు.
శనివారాన్ని శని దేవుడుకి అంకితం చేశారు. శనివారం తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో లేదా శని ఆలయంలో శని పూజ చేయాలి. ఆవనూనెతో దీపం వెలిగించి ఓం వం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. లేదా శని చాలీసా, శని స్తోత్రాన్ని పఠించాలి. ఇది శని భగవానుడు ఆశీర్వాదాలను మీకు అందిస్తుంది. జీవితంలోని ప్రతికూలతలను తొలగిస్తుంది.
శనివారం పేదవారికి దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి మీ కర్మ ఫలితాలను మీరు చేసిన పాపాలను ఇది సమతుల్యం చేస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడతారు జాతకం బలహీనంగా ఉన్నవారికి పదేపదే ఆర్థిక నష్టాలు ఇస్తున్నవారు శనివారం పేదవారికి దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి
రావి చెట్టు
శనివారం రావి చెట్టును పూజించడం ఎంతో శుభప్రదం. శనివారం సాయంత్రం లేదా సూర్యోదయం తర్వాత రావిచెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తే ఎంతో మంచిది. శనీశ్వరుడి ఆశీర్వాదం మీకు దక్కుతుంది. మనసుకు ప్రశాంతత దక్కుతుంది.
హనుమాన్ చాలీసా
హనుమంతుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలనుంచైనా బయటపడతారని అంటారు. హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పారాయణం చేస్తే మంచిది. ముఖ్యంగా శనివారం హనుమాన్ చాలీసా ఒకటి కంటే ఎక్కువసార్లు పారాయణం చేయడం వల్ల శని దోషాలు, భయము, మానసిక ఒత్తిడి వంటివి తొలగిపోతాయి. ఆ రోజు శని ఆలయాన్ని కూడా సందర్శిస్తే మంచిది. అలాగే హనుమంతుడికి చెందిన ‘ జై భజరంగబలి’ అనే మంత్రాన్ని జపిస్తే ఇంకా ఉత్తమం.
శనిదేవుడు అబద్ధం, మోసం, దుర్మార్గం వంటి దుష్ప్రవర్తనలను అసహ్యించుకుంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ నిజాయితీగా, కష్టపడి జీవించడం, ఇతరులకు న్యాయం చేయడం ఆయనను ప్రసన్నం చేస్తుంది.
శనిదేవుడు కర్మదేవుడు కాబట్టి, దయ, సహాయం, న్యాయం వంటి గుణాలు ఆయనకు ఇష్టం. పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు సహాయం చేయడం, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, ఆవులు, కుక్కలకు ఆహారం ఇవ్వడం వంటి పనులు శని అనుగ్రహానికి దారి తీస్తాయి.
శనిదేవుడు నల్ల రంగును ఇష్టపడతాడు. అందుకే శనివారాల్లో నల్ల వస్త్రాలు, నువ్వులు, నువ్వుల నూనె, ఇనుప పదార్థాలు, దుప్పట్లు వంటివి పేదలకు దానం చేయడం ద్వారా శని కృప లభిస్తుంది.