మహిళలు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని పనులు మహిళలు నిలబడి చేయడం వల్ల చెడు ఫలితాలు రావచ్చు. మహిళలు నిలబడి చేయకూడని పనులేంటో తెలుసుకోండి. ఏ పనైనా వాస్తు ప్రకారం జరిగితేనే మంచిది. లేకుంటే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. ఇది ఆర్థిక సమస్యలకు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఎలాంటి పనిలో నిలబడి చేయకూడదు తెలుసుకోండి.
వాస్తు ప్రకారం మహిళలు నిలబడి జుట్టు దువ్వుకోకూడదు. అలా చేస్తే వారికి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే వారి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వంటివి తగ్గిపోతాయి. భర్త జీవితం కూడా కష్టాల పాలవుతుంది. అతనికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. మహిళలు ఎల్లప్పుడూ జుట్టుకు దువ్వుకునేటప్పుడు కింద కూర్చునే ఉండాలి. అలాగే రాలిపోయిన వెంట్రుకలు గదంతా చెదిరిపోకుండా ఒకచోట ఉండేలా చూసుకోవాలి. ఆ మొత్తం ఆ జుట్టును బయటపడేయాలి. దీనివల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.
వాస్తు శాస్త్ర ప్రకారం పెద్దలను దూరం నుంచి పలకరించే ముందు నిలబడి ఉండకూడదు. శాస్త్రాల ప్రకారం నమస్కరించేటప్పుడు కాస్త ఒంగిని నమస్కరించాలి. ఇది వారి ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడుతుంది. అలాగే మీ పట్ల గౌరవపూర్వకమైన స్వభావాన్ని కూడా ప్రదర్శిస్తుంది.
పూజ చేసేటప్పుడు
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం స్త్రీలు ఎప్పుడూ నిలబడి పూజ చేయకూడదు. ప్రార్థనలు, పూజా వంటివన్నీ కూడా దేవుని పట్ల భక్తిని చూపించేవి. కాబట్టి అవి మీరు దేవుడికి చేరాలంటే కూర్చునే చేయాలి. వాస్తు చెబుతున్న ప్రకారం పూజ చేసేటప్పుడు ఎప్పుడు నిలబడకండి. ఇది మంచి ఫలితాలను ఇవ్వదు. కూర్చునే పూజ చేయండి. హారతి సమయంలో మాత్రమే నిలబడాలి.
నిలబడి చదవద్దు
కొందరు అమ్మాయిలు నడుస్తూ నిలబడి చదువుకునే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రం చదువుతున్న ప్రకారం ఈ అలవాటు చాలా చెడ్డది. ఆ విధంగా చదువుకోవడం వల్ల మనసు ఏకాగ్రతగా ఉండదు. ప్రశాంతంగా కూడా అనిపించదు. జ్ఞానం కూడా తగ్గిపోతుంది. ఇది పూర్తి విద్యను అందించలేదు.
నిలబడి స్నానం వద్దు
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం స్నానం చేయడం అనేది ఎంతో పవిత్ర కార్యం మహిళలు ఆ కార్యాన్ని నిలబడి చేయకూడదు. పురుషులు కూడా నిలబడి స్నానం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇద్దరు కూడా కూర్చొని స్నానం చేయడం మంచిది బాత్రూంలో కూర్చో లేనప్పుడు చిన్న స్టూల్ వేసుకొని స్నానం చేసి చేసుకోవడం మంచిది నిలబడి స్నానం చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది శరీరం మనసు శుద్ధి కాదు