Rashmika Mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుని.. ఇప్పుడు నేషనల్ క్రష్ గా చలామణి అవుతున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ‘క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్’ అనే బిరుదును కూడా దక్కించుకుంది. పుష్ప సినిమాతో మొదలైన ఈమె అదృష్టం ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పవచ్చు. వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె తాజాగా తన మనసులో కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ప్రతి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. అలాంటి పాత్రలో నటించనుంది అంటూ చెప్పింది. అసలు విషయంలోకి వెళ్తే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక తాజాగా తనకు కొరియన్ డ్రామాలు చేయాలనే ఆసక్తి ఉందని తెలిపింది. నిజానికి కోవిడ్ సమయంలోనే కొరియన్ సినిమాలపై ప్రేమ పెరిగిందని చెప్పిన రష్మిక.. కథ నచ్చితే ఆ ప్రాజెక్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని హింట్ ఇచ్చింది. ఇకపోతే ఆమె సినీ కెరియర్ లో వైవిధ్యాన్ని పెంచేందుకు వేసిన అడుగులుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కొరియన్ చిత్రాలలో అవకాశం వస్తే ఎలాంటి పాత్రలో నటిస్తుందో చూడాలి.
ALSO READ:Prabhas @23 Years : అది బాడీ కాదురా… బాక్సాఫీస్.. 23 ఏళ్లల్లో ఎన్ని వేల కోట్లు అంటే ?
రష్మిక మందన్న వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. గీతాగోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండ తో ఏర్పడిన పరిచయం అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ఇద్దరూ డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటించారు. అయితే అప్పటినుంచి వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగారు. పైగా రష్మిక – విజయ్ దేవరకొండ ఇంట్లో ఎక్కువగా కనిపించేది. ఆయన ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు ఈమె హాజరయ్యేది. అంతేకాదు విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఆమె సినిమాలు కూడా బహిరంగంగా థియేటర్లో చూస్తూ తమ బంధాన్ని ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూ వచ్చింది. కానీ వీరి విషయంపై విజయ్ దేవరకొండ ఏ రోజు ప్రకటించలేదు.
ఇకపోతే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఇటీవల ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఈ విషయంపై ఎక్కడా స్పందించలేదు. పైగా వీరు ధరించిన ఉంగరాలే వీరికి నిశ్చితార్థమైందనే విషయాన్ని రివీల్ చేశాయి. తర్వాత వచ్చే ఏడాది పెళ్లి జరగబోతోంది అంటూ వార్తలు వస్తున్నా.. ఇద్దరూ స్పందించలేదు. కానీ సడన్ గా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అసలు విషయాన్ని చెప్పి అందరికీ ఊరట కలిగించింది రష్మిక. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక విజయ్ దేవరకొండ తో పెళ్లి అంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.