BigTV English

God idols : ఇంట్లో ఏడుకొండవాడి లోహ విగ్రహాలు పెట్టుకోకూడదా….

God idols  : ఇంట్లో ఏడుకొండవాడి లోహ విగ్రహాలు పెట్టుకోకూడదా….
God idols

God idols : కలియుగ దైవం ఏడుకొండలవాడు. శ్రీనివాసుడు చాలామందికి కులదైవంగా ఆరాధింపబడుతుంటాడు. శ్రీ వేంకటేశ్వరుడు శ్రీనివాసుడు. ఆయన పటం ఇంట్లో ఉంటే ఐశ్వర్యాలు చక్కగా వర్ధిల్లుతాయి. అంతే కానీ ఆయన పటం, విగ్రహం ఉంటే డబ్బుఖర్చయిపోతుందనీ, అప్పులపాలైపోతారనీ ప్రచారం ఉంది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని పండితులు చెబుతున్నారు. కొందరు విలువైన విగ్రహాలను తస్కరించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి ఏ దేవతా విగ్రహమైనా మేలు కలిగించడమే వాటి స్వభావం. ఆ పటాలుండకూడదని చెప్పడానికి ఏ శాస్త్ర ప్రమాణమూ లేదు. కొందరు పార్థసారథి పటం ఉండకూడదనీ, వేణువూదే కృష్ణుడి పటం కానీ, బొమ్మ కానీ ఉండకూడదని చెబుతుంటారు. ఇవన్నీ నోటికి వచ్చిన మాటలే తప్ప శాస్త్ర వాక్యాలు కావు . నిరభ్యంతరంగా శ్రీనివాసుని పటాన్ని ఉంచవచ్చు.


అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా వెండి, బంగారు, ఇత్తడి. పంచలోహాలు శిలావిగ్రహాలు ఇంట్లో ఉంచి పూజించేటట్లయితే ఎక్కువ పరిమాణంలో ఉండరాదు. అరచేతి నిడివిని మించరాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ , పేపర్ పల్ప్ వంటి వాటితో చేసిన విగ్రహాలు పెద్ద పరిమాణంలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. వాటిని పూజా విగ్రహాలుగా కాకుండా అలంకారాకృతులుగా ఉంచి నమస్కరించుకోవచ్చు.

ఇంట్లో పెట్టుకునే దేవుడి విగ్రహం యొక్క ఆదర్శ ఎత్తు 9 అంగుళాల కంటే ఎక్కువ కానీ 2 అంగుళాల కంటే తక్కువ ఉండకూడదు . విగ్రహం భూమి నుండి కనీసం 6 అంగుళాల ఎత్తులో గోడ నుండి ఒక అంగుళం దూరంలో ఉండాలి. అదే విధంగా ధ్యానభంగిమలో ఉన్న శివుని పటాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచవచ్చు. ధ్యానసాధనకు, జ్ఞానానికీ, శివత్వానికీ హేతువు శివుని తపోమూర్తి.


పరిమితి మించిన ఎత్తు ఉన్న విగ్రహం ఇంట్లో ఉంచుకుని పైన చెప్పిన నియమాలు పాటించక పోతే ఇంట్లో ధనం నిలవదు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, విద్య ఉద్యోగం వివాహం అన్నిటా ఆటంకం .ఎన్ని పరిష్కారాలు ఆలోచించినా సమస్య అర్థము కాదు.అయితే కొందరికి వంశపారంపర్యంగా వస్తున్న విగ్రహం అయితే కొన్ని పూజలు నియమాలు పాటిస్తే చాలా మంచిదే ..
విగ్రహాలు చూడటానికి బాగున్నాయి కదా అని దర్శించిన ప్రతి గుడి దగ్గర నుంచి విగ్రహాలు తెచ్చిపెట్టకూడదు..

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×