Big Stories

Shani Vakri 2024: జులై నుండి నవంబర్ వరకు శని తిరోగమనం వల్ల ఈ రాశులకు అన్నీ సమస్యలే.. తస్మాత్ జాగ్రత్త!

Shani Vakri 2024: శనిదేవుడి పేరు వింటేనే భయపడుతుంటారు. శని దేవుడి కరుణ తమపై ఉంటే చల్లగా జీవిస్తారని, అదే శనిదేవుడి ఆగ్రహానికి గురైతే జీవితమే నాశనం అవుతుందని ఆందోళన చెందుతుంటారు. కొన్ని సార్లు శనిదేవుడి అందరికీ శుభాలే చేకూర్చినా కూడా శని దేవుడి తిరోగమనం కారణంగా చాలా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ నెలాఖారులో అంటే జూన్ నెలలో శనిదేవుడి తిరోగమనం ఉండబోతుంది. అయితే శని తిరోగమనం వల్ల కుజుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో శని, కుజుడి వ్యతిరేక కోణంలో ఉంటాడు. ముఖ్యంగా చాతుర్మాసాల్లో శివుని రుద్రరూపం పాలిస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితిలో శని క్షీణత ప్రకృతి వైపరీత్యాలు, మానవ వనరులను కోల్పోయే అవకాశాలను పెంచుతుంది. ఈ తరుణంలో పలు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా కర్కాటకం, కుంభ రాశి సహా మరో 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉండబోయే అవకాశం ఉండబోతుందని చెబుతుంది. ఆ రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

1. కర్కాటక రాశి

- Advertisement -

కర్కాటక రాశి వారికి శని సంచారం చాలా ప్రమాదాలను తెచ్చిపెట్టనుంది. వ్యాపారంలో భారీ నష్టాలను చవిచూడవచ్చు. మరనోవైపు డబ్బు నీరులా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న పొరపాటు లేదా అజాగ్రత్త చాలా ప్రమాదాలను తెచ్చే అవకాశం ఉంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. వీటికి నివారణగా శనివారం అశ్వథ్ వృక్షం కింద ఆవాల నూనె దీపం వెలిగించాలి.

2. వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి శని క్షీణత కారణంగా శారీరక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. భాగస్వామితో ఏదో ఒక సమస్యపై వివాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా సంబంధం దెబ్బతినవచ్చు. అదే సమయంలో, ప్రేమ జీవితంలో మోసపోవచ్చు. ఇది జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. కెరీర్‌లో వైఫల్యాలను ఎదుర్కొంటారు. భారీ ఆర్థిక నష్టాల సంకేతాలు కూడా ఉన్నాయి. పరిహారంగా, ప్రతి శనివారం నల్లని దుస్తులు ధరించండి.

3. మకర రాశి

శని సంచారం వ్యక్తిగత జీవితంలో చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. జీవితంలో సంతోషంగా ఉండరు. నిరాశకు గురై ఆందోళన చెందుతారు. జీవితంలో ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక స్థితి చాలా ప్రభావితం కావచ్చు. వ్యక్తిగత జీవితంలో విభేదాలు పెరగవచ్చు. కొందరితో సంబంధాలు తెగిపోతాయి. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు పెరగవచ్చు. వ్యాపారంలో డబ్బు కొరతను ఎదుర్కోవచ్చు. పరిహారంగా, ప్రతి శనివారం నల్లబెల్లం పప్పును దానం చేయండి.

4. కుంభ రాశి

కుంభ రాశి వారికి శని సంచారం అశుభ ఫలితాలు కలిగిస్తుంది. శని దేవుడికి వ్యతిరేకంగా చేసే పని జీవితంలో ఆకస్మిక సమస్యలను కలిగిస్తుంది. ఈ సమయంలో, అధిక కోపం కూడా చేసే పనిని పాడు చేస్తుంది. ఏ పనైనా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించవద్దు. పరిహారంగా, సోమవారాల్లో శివుడికి శమీ లేదా లజమావతి ఆకులను సమర్పించండి.

5. మీన రాశి

మీన రాశి వారికి వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో శని క్షీణత ఒడిదుడుకులను కలిగిస్తుంది. ఈ సమయంలో ప్రణాళికలు విజయవంతం కావు. వ్యాపారంలో నష్టాన్ని కూడా ఎదుర్కోవచ్చు. ఆఫీసు వ్యక్తులతో వాదనలు పెట్టుకుంటే పని వాతావరణాన్ని పాడుచేస్తాయి. వైవాహిక జీవితంలో సంబంధం చెడిపోవచ్చు. దీనికి పరిష్కారంగా, ప్రతి శనివారం చేపలకు పిండి గుళికలతో ఆహారం ఇవ్వండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News