ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త సంవత్సరం వేళ కొత్త టూర్ ప్లాన్ ను పరిచయం చేసింది. తక్కువ ఛార్జీతో బ్యాంకాక్, పట్టాయాలో ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్ల పాటు కొనసాగుతుంది. డబుల్ ఆక్యుపెన్సీ ఉన్న వ్యక్తికి కేవలం రూ. 57,730 ఛార్జ్ చేస్తుంది. పరిమిత సంఖ్యలో పర్యాటకులను ఈ టూర్ కు తీసుకెళ్లనున్నట్లు IRCTC వెల్లడించింది.
బ్యాంకాక్, పట్టాయా టూర్ కు మొత్తం మొత్తం 35 మంది ప్రయాణికులను తీసుకెళ్లనున్నట్లు IRCTC అధికారులు తెలిపారు. తక్కువ సంఖ్యలో పర్యాటకులకు అవకాశం ఉన్న నేపథ్యంలో మొదట బుకింగ్ చేసుకున్న వారికే ఈ అవకాశం దక్కుతుందని తెలిపారు. ఆసక్తిగల ప్రయాణికులు వెబ్ సైట్ లో ప్యాకేజీ వివరాలను తెలుసుకోవడంతో పాటు టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. షెడ్యూల్, బయలుదేరే సమయాలు సహా పూర్తి వివరాలను IRCTC సైట్ లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
బ్యాంకాక్, పట్టాయా 6 రోజుల పర్యటనలో భాగంగా పర్యాటకులకు IRCTC పలు సౌకర్యాలు కల్పించనుంది. రౌండ్-ట్రిప్ విమాన ఛార్జీలు, త్రీ స్టార్ హోటల్ లో వసతి సౌకర్యాన్ని ప్రతి పర్యాటకుడికి అందించనుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అందరికీ బ్రేక్ ఫాస్ట్, లంచ్, రాత్రి డిన్నర్ అందిస్తుంది. లోకల్ ప్రయాణాల కోసం AC బస్సు ద్వారా సందర్శనా స్థలాలకు తీసుకెళ్తుంది. ఎంట్రీ ఫీజులు, ట్రావెల్ గైడ్స్, టూర్ గైడ్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
బ్యాంకాంక్, పట్టాయా టూర్ లో భాగంగా పలు పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం ఉంటుంది. తొలుత బ్యాంకాక్ వెళ్లనున్న టూరిస్టులు అక్కడ, సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్, చావోఫ్రే రివర్ క్రూయిజ్, టెంపుల్ తో పాటు సిటీ టూర్ ను ఎంజాయ్ చెయ్యొచ్చు. అటు పట్టాయాలోనూ పలు పర్యాటక ప్రదేశాలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ముఖ్యంగా కోరల్ ఐలాండ్ టూర్, అల్కాజార్, టిఫనీ షోను ఆస్వాదించవచ్చు.
Read Also: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!
కొత్త సంవత్సరం రోజును మరింత హ్యాపీగా జరుపుకోవాలనుకునే వాళ్లు వెంటనే ఫారిన్ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలని IRCTC అధికారులు తెలిపారు. తక్కువ మందిని తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టికెట్లు పొందాలన్నారు.
Read Also: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!