Gundeninda GudiGantalu Today episode November 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఆవేశంగా ఇంటికి రావడంతో మీనా ఏవండీ మీరు ఇంత ఆవేశంగా ఇంటికి వెళ్తున్నారంటే ఏదో ఒక గొడవ చేస్తారు అమ్మమ్మ గారి పుట్టినరోజు అయ్యేంతవరకు మీరు ఎటువంటి గొడవ చేయదు అని మాట తీసుకుంటుంది. ఆ తప్పు చేసింది ఎవరు? మనము రెండు రోజుల తర్వాత తెలుసుకుందాం మీరు మాత్రం ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అని మీనా సలహా ఇస్తుంది.. దానికి బాలు అదేంటో తేలుస్తాను వారి అంత చూస్తాను అని అంటాడు.. ఒకసారి మావయ్య గారిని చూడండి వాళ్ళ అమ్మ పుట్టినరోజు కోసం అని ఎంత సంతోషంగా ఉన్నారో… సంతోషాన్ని మీరు దూరం చేస్తారా అని నేను అడుగుతుంది.. తన నాన్న సంతోషం చూసి అసలు విషయం చెప్పడం మర్చిపోతాను అనుకుంటాడు. సుశీల ఇంటికి రావడంతో ప్రభావతి టెన్షన్ పడుతుంది. బాలు సెటైర్లతో ఎపిసోడ్ సరదాగా సాగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్యం ప్రభావతి ఇద్దరూ సుశీల కోసం బయట ఎదురు చూస్తూ ఉంటారు.. ఇంటిదాకా వచ్చింది ఇంట్లోకి రాకుండా పోతుందా ఏంటి అని ప్రభావతి అంటుంది.. అందరూ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సంతోషంగా ఉంటారు.. మీనా హారతి తీసుకొని వస్తుంటే.. ఏంటి నువ్వు మంచి దానివి అని మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా ఆ హారతి రోహిణి శృతి ఇస్తారు అని అంటుంది.. హారతి వాళ్ళకి ఇచ్చి తీయమని చెప్తుంది.. మీనా అక్కడే ఉంది కదా ముగ్గురు కలిసి తీస్తారని సుశీల అంటుంది. లోపల సుశీలమ్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినవి చూసి ఆమె చాలా సంతోషంగా మురిసిపోతుంది.
ప్రభావతి మాత్రం ఇదంతా మీ కోసం నేనే దగ్గర నుండి చేయించాను అత్తయ్య గారు అని అంటుంది. బాలు ఏంటి నీ మొహం ఎప్పుడైనా ఇలాంటివి చేసిందా అని సెటైర్లు వేస్తాడు.. నాకు తెలుసు రా మీరందరూ నా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేస్తారని మీరు అందరు సంతోషం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు పిలిచారు అని ఇక్కడికి వచ్చాను కదా నాకు ఇలాంటివి ఏదో చేస్తారని అర్థమైంది అని సుశీల అంటుంది.. అయితే అందరూ మీరు 75 ఏళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు కదా ఏంటి కారణం అని అడుగుతారు. శృతి మాత్రం మీరు ఇన్నేళ్లు చాలా అందంగా ఉన్నారు సీక్రెట్ ఏంటి బామ్మ గారు అని అడుగుతుంది. సుశీలమ్మ అందరి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తుంది.
సత్యం నీకోసం పిల్లలు చాలా ప్లాన్ చేశారు అమ్మ నీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని అనుకుంటున్నారు అని అంటాడు. నీవు గిఫ్ట్లు కూడా ప్లాన్ చేశారు అని అనగానే సుశీల నాకు తెలుసురా మీరందరూ ఇలాంటివి చేస్తారని అందుకే మీ అందరికీ నేను ఒకసారి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరందరూ నన్ను ఇంప్రెస్ చేస్తే ఖచ్చితంగా ఆ గిఫ్ట్ మీకే అని సుశీల అంటుంది.. నువ్వు సర్ప్రైజ్ అంటున్నావ్ అంటే కచ్చితంగా ఏదో చిన్నప్పుడు ఆటల్లాగా పెట్టి ఇవ్వాలనుకుంటున్నావు కదా బామ్మ అని బాలు అడుగుతాడు.. నా మనసుని అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడివేరా అని సుశీల బాలుని పొగిడేస్తుంది.. సుశీలను ఫ్రెష్ అయ్యి రా తర్వాత సంగతి చూద్దామని సత్యమంటాడు..
ఇంక ప్రభావతి అత్తయ్య ఇలాంటి గిఫ్ట్ ఇస్తుందో ఏదైనా ఆకలిస్తుందేమో డబ్బులు ఇస్తుందేమో అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆ గిఫ్ట్ నేనే కొట్టేయాలి అని ప్రభావతి ఆలోచిస్తుంది.. అప్పుడు అక్కడికి వచ్చిన సత్యం ఏంటి అంతగా ఆలోచిస్తున్నావని ప్రభావతి అని అడుగుతాడు. అత్తయ్య గారికి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ నేనే కొట్టేయాలి అని ప్రభావతి అంటుంది.. ఇంతకీ ఆవిడ మీ అమ్మగారే కదా ఆమెను ఏం ప్లాన్ చేసిందో మీకు తెలియదా అని సత్యం అని అడుగుతుంది.. నాకు కూడా తెలియదు ప్రభ అని అనగానే మీకు ఏమీ తెలీదు నేనే చూసుకుంటానని ప్రభావతి వెళ్ళిపోతుంది..
Also Read : పల్లవికి షాకిచ్చిన మీనాక్షి.. కమల్ దెబ్బకు పల్లవికి మైండ్ బ్లాక్.. అవనికి తండ్రి ఎవరో తెలుస్తుందా..?
ఇక మనోజ్ బామ్మ ఈసారి మనమే కొట్టేయాలి. ఆ బాలుకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటారు.. మీ బామ్మ కి ఏది ఇష్టమో నీకు తెలుసు కదా అది ఏదో కనిపెట్టు అని రోహిణి మనోజ్ ని అడుగుతుంది.. చిన్నప్పుడు మా బావకి పగడాల దండ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ దండ పోయిందని బామ్మ చాలా బాధపడింది. అలాంటిది కొనిస్తే బామ్మ ఇంప్రెస్ అవుతుంది అని మనోజ్ అంటారు.. అటు రవి శృతి కూడా భామను ఇంట్రెస్ట్ చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. నేను ఒక మంచి కేక్ తయారుచేసి బామ్మర్ది ఇంప్రెస్ అవుతుంది అని శృతి తో అంటాడు.ఎగ్ లెస్ కేక్ లాగా షుగర్ లెస్ కేక్ ని తయారు చేసేస్తాను.. అయితే నువ్వు అదే ఫిక్స్ అయిపో అని శృతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…