OTT Movie : సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇచ్చే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాను సింగిల్ గా చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ కథ ఒక అమ్మాయి వెకేషన్ కి వెళ్ళాక మొదలవుతుంది. ఒక అపరిచితుడితో ఒక రాత్రి గడిపాక అసలు కథ మొదలవుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఇదొక మస్ట్ వాచ్ మూవీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
“Berlin Syndrome” 2017లో వచ్చిన ఆస్ట్రేలియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. మెలానీ జోస్టెన్ రచించిన నవల ఆధారంగా, దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ దీనిని తెరకెక్కించాడు. ఇందులో టెరెసా పాల్మర్ (క్లేర్), మాక్స్ రీమెల్ట్ (ఆండి) లీడ్ రోల్స్ లో నటించారు. 116 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Netflix, Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ క్లేర్ బెర్లిన్‌కి సోలో ట్రిప్‌కి వస్తుంది. అక్కడ ఒక స్ట్రీట్‌లో హ్యాండ్‌సమ్ ఇంగ్లీష్ టీచర్ ఆండిని కలుస్తుంది. ఫ్లర్టింగ్ తర్వాత వన్ నైట్ స్టాండ్ జరుగుతుంది. మరుసటి రోజు ఆండి అపార్ట్‌మెంట్‌లో క్లేర్ మెలుకువలోకి వచ్చి చూస్తే డోర్ లాక్ చేసి ఉంటుంది. విండోస్ కూడా సీల్ చేసి ఉంటుంది. ఆండి ఆమె ఫోన్ లో సిమ్ కార్డ్ కూడా తీసేశాడు. అతను ఆమెను బందీగా ఉంచేశాడు. ఇక ఆండి రోజూ పనికి వెళ్లి వచ్చి నార్మల్ లైఫ్ నటిస్తాడు. ఇద్దరూ డిన్నర్ చేస్తారు, ఏకాంతంగా గడుపుతారు. కానీ క్లేర్ ఎస్కేప్ ట్రై చేస్తూ పోలీస్‌కి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆమె ప్రయత్నాలు ఏ మాత్రం పనిచేయవు.
Read Also : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?