Intinti Ramayanam Today Episode November 7th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన ఫ్రెండ్ ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళుతుంది. పల్లవిని చూసిన తన ఫ్రెండు షాక్ అవుతుంది.. పల్లవి నువ్వేంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. నీతో ఒక చిన్న పని ఉంది అందుకే వచ్చాను అని అనగానే నాకోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చావా..? అంటే ఏదో ఉంది అని రా ఇంట్లోకి గానీ తన ఫ్రెండ్ అంటుంది..ఎందుకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు ఏదైనా సమస్యలో ఉన్నావా అని అడుగుతుంది.
సమస్యలు కాదు కానీ నాకు కొంచెం డబ్బులు కావాలి నువ్వు ఏర్పాటు చేయగలవా అని అడుగుతుంది. మీ నాన్న కోటీశ్వరుడు కదా మీ నాన్న నేను అడగొచ్చు కదా అని తన ఫ్రెండ్ అంటుంది… మా నాన్న నాకు ఇవ్వనని చెప్పాడు. మా వాళ్లు ఆస్తులు పోగొట్టుకున్నారు నీకు తెలియంది కాదు అని పల్లవి చెప్తుంది. నువ్వు నీ భర్త గురించి చాలా గొప్పగా చెప్పావు. నా భర్త అమెరికాలో కంపెనీలో పని చేస్తున్నాడు అది ఇది అని చెప్పావు. కానీ నాలాంటి వాళ్ళు ఇళ్లల్లోనే కరెంటు పని చేసుకుంటున్నాడు అని తెలిసి నీ గురించి ఆలోచించాను.. నీకు ఎట్టి పరిస్థితులలో డబ్బులు ఇవ్వను అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది.. చక్రధర్ కూడా ఇవ్వను అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని వాళ్ల అమ్మ ఎవరు అని తెలుసుకోవాలని లోపలికి వెళ్లి ఆ పల్లవి చూస్తుంది. మా అమ్మ లేదు అని అన్నావు కదా ఈవిడే మా అమ్మ అని అవని పరిచయం చేస్తుంది. ఇన్ని రోజులు అవనికి అమ్మానాన్న లేరు అని అవమానించావు ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారని అక్షయ్ అంటాడు. పల్లవి మీ అమ్మ వచ్చింది సరే నాన్న కూడా ఉండాలి కదా ఎక్కడ అని అడుగుతుంది. మీ నాన్న ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తాడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని పల్లవి అడుగుతుంది. అమ్మ నాన్న ఇద్దరూ ఉంటేనే కదా నువ్వు వచ్చేది అని దారుణంగా మాట్లాడుతుంది పల్లవి. ఇప్పుడు ఆ విషయాల గురించి నేను చెప్పలేను అమ్మ అని మీనాక్షి అంటున్నా సరే పల్లవి మాత్రం గుచ్చి గుచ్చి ఇబ్బంది పెడుతుంది.
ఆ విషయం గురించి నువ్వేం పట్టించుకోవద్దు అమ్మా అని మీనాక్షితో అవని అంటుంది. ఆ తర్వాత మీనాక్షిని లోపలికి తీసుకోని వెళ్ళమని ఆరాధ్యకు చెప్తుంది.. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వేం పట్టించుకోవద్దు అమ్మ కానీ నువ్వు మా నాన్న ఎవరో చెప్పట్లేదు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది అందరూ అడుగుతున్నారు సరే నువ్వు మాట కూడా మాట్లాడలేదు అంటే కచ్చితంగా ఏదో ఉంది అని అంటుంది. ఇప్పుడైతే నేను మీ నాన్న గురించి చెప్పలేనమ్మ కానీ త్వరగా మీ నాన్న గురించి అయితే చెప్తాను అని అంటుంది.
అమ్మమ్మ నేను నువ్వు కథలు చెప్తే నీ దగ్గర పడుకుంటాను అని ఆరాధ్య అంటుంది. నీకు కథలతో పాటు చాలా బొమ్మలు గురించి చెప్తాను అని మీనాక్షి అనడంతో అయితే నీ దగ్గరే పడుకుంటాను అని ఆరాధ్య అంటుంది. భరతుచి మా అమ్మని బాగా మజ్జిక చేసుకున్నావు కదా అని అంటాడు. నేనేమీ అలా అనలేదు మావయ్య అమ్మమ్మ నాకు కథలు చెప్తానని అంటుంది అని ఆరాధ్య అంటుంది. ప్రణతి మీకు భోజనం వడ్డిస్తాను రండి అత్తయ్య అని అంటుంది. ఇప్పుడే వద్దమ్మా కాసేపు ఆగి తిందామని మీనాక్షి అంటుంది.
మీరిద్దరు పెళ్లి నాకు చెప్పకుండానే చేసుకున్నారు పెళ్లిచూసే భాగ్యం నాకు లేదు అందుకే నీకోసం ఈ రింగ్ గిఫ్ట్ గా ఇస్తున్నానని మీనాక్షి అంటుంది. ఇంత పెద్ద ఇంటి నుంచి వచ్చావు నీకు ఇంతకన్నా ఏమీ ఇచ్చుకోలేను అని మీనాక్షి అంటుంది. అవని ప్రణతి చాలా మంచి అమ్మాయి అమ్మ ఎంత పెద్ద కుటుంబంలో ఉన్న తాను మాత్రం చాలా మంచిగా ఉంటుంది అని అంటుంది. నేను ఇలా ఉండడానికి కారణం మా వదినే మా వదినని చూసి నేర్చుకున్నాను అని ప్రణతి అనగానే చాలు ఇక మోసింది అని అవని అంటుంది. అందరూ కలిసి సరదాగా ఉంటారు.
ఇక పల్లవి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నా దగ్గర చెల్లి గవ్వ కూడా లేవమ్మా.. నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇవ్వమ్మా.. నాన్న లాగా పట్టించుకోవట్లేదు కనీసం నువ్వు కూడా పట్టించుకోవాలి అని అడుగుతుంది.. నేను అమ్మని మీ నాన్న లాగా కఠినంగా ఉండలేను నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి నీకు ఇస్తాను రేపు వచ్చి తీసుకెళ్ళు అని అంటుంది.. ఆ మాట వినగానే పల్లవి సంతోషంతో ఫోన్ పెట్టేస్తుంది.. దీనికి తల్లి అవసరం లేదు కానీ తల్లి డబ్బులు మాత్రం కావాలి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో అని రాజేశ్వరి అనుకుంటుంది.
పల్లవి రేపు డబ్బులు వస్తున్నాయని సంతోషంతో లెక్కలు వేసుకుంటూ ఉంటుంది. గదిలోకి వచ్చిన కమల్ ఏంటి అంత సంతోషంగా గాల్లో లెక్కలేస్తున్నావ్ అని అడుగుతాడు. నీకు మంచిగా ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు కదా.. ఇన్ని రోజులు మా వదినకు అమ్మానాన్న లేరు అని అవమానించావు.. ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తే మీ నాన్న ఎక్కడ అని అడుగుతున్నావు కొంచమైన బుద్ధుందా అని కమలంటాడు. ఇప్పుడు మీ వదిన పురాణమేనా అని పల్లవి పడుకుంటుంది. నువ్వు ముందు లే అని కమల్ బయటికి పంపిస్తాడు. ఇక రాత్రంతా పల్లవి బయట దోమలతో చలితో పడుకుంటుంది.
Also Read :శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
ఉదయం లేవగానే పల్లవి బయటకు వెళ్తూ ఉంటుంది. హలో ఎక్కడికి వెళ్తున్నావ్ ఇంట్లో వెళ్లేటప్పుడు ఎవరికైనా చెప్పేసి వెళ్లాలని తెలియదా నీకు అని కమలంటాడు. నా అవసరాలకి డబ్బులు ఇవ్వమని నిన్ను అడగట్లేదు అందుకే నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను అని కమల్ తో అంటుంది. మీ నాన్న దగ్గరికి వెళ్తే మీ నాన్న ఇస్తాడా ఆల్రెడీ ఇవ్వను పో అన్నాడు కదా అని కమలంటాడు. ది గ్రేట్ బిజినెస్ మాన్ చక్రధర కూతురిని నేను అని అనగానే ఆ మాట మీనాక్షి ఉంటుంది. పల్లవి నాన్న చక్రధర్ నా రా అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..