Kiss movie OTT : ఓటీటీలోకి సినిమాలు జాతరలా వచ్చిపడుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ కావడమే ఆలస్యం ఓటీటీలో డేట్స్ గురించి ఆడియన్స్ కూడా తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక బిగ్ స్క్రీన్ లో కి వచ్చాక, ఓటీటీలోకి రావడానికి నెల రోజుల సమయం కూడా పట్టడం లేదు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన తమిళ రొమాంటిక్ మూవీ ‘కిస్’, ఓటీటీలోకి నెల తిరక్కుండానే అడుగు పెట్టబోతోంది. కెవిన్ హీరోగా నటించిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్లకు పైగా వసూలు చేసి స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుంది ? ఎప్పుడు వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ సినిమా ‘కిస్’. ఈ సినిమాలో కెవిన్, ప్రీతి అస్రాని హీరో, హీరోయిన్లుగా నటించారు. సతీష్, VTV గణేష్, మొట్ట రాజేంద్రన్ సపోర్ట్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు 2025 నవంబర్ 7 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో చూడలేక పోయిన వాళ్ళు, ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో చూసి ఆనందించండి.
నెల్సన్ మార్కస్ (కవిన్) అనే సంగీతకారుడికి తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల ప్రేమ పట్ల, బంధాల పట్ల అతనికి నమ్మకం పోతుంది. ఒకరోజు సారా (ప్రీతి అస్రాని) అనే అమ్మాయి అతనికి ఒక మ్యాజికల్ పుస్తకాన్ని ఇస్తుంది. ఆ పుస్తకం కారణంగా నెల్సన్‌కు ఒక వింత అతీంద్రియ శక్తి వస్తుంది. ఆ శక్తి ఏమిటంటే: ఎప్పుడైతే ఒక జంట ముద్దు పెట్టుకోవడం చూస్తాడో, వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అతనికి ఒక కనిపిస్తుంది. మొదట్లో నెల్సన్ ఈ శక్తిని సరదాగా ఉపయోగిస్తాడు. కొన్ని జంటల భవిష్యత్తును చూసి ఆటపట్టిస్తాడు.
Read Also : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ
కానీ నెల్సన్ స్వయంగా సారా ప్రేమలో పడినప్పుడు కథలో మలుపు తిరుగుతుంది. ఒక సారి సారాతో నెల్సన్ ముద్దు పెట్టుకున్నప్పుడు, నెల్సన్‌కు సారా గురించి ఒక భయంకరమైన, విషాదకరమైన విజన్ కనిపిస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయికి జరగబోయే ఆ దురదృష్టకరమైన విధిని మార్చడానికి నెల్సన్ ఏమి చేశాడు? విధిని మార్చడం సాధ్యమా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా మిగతా కథ. ఈ విషయాలను మీరు కూడా తెలుసుకోవాలను కుంటే, రొమాంటిక్ సినిమాను మిస్ కాకుండా చూడండి.