భాగీ కడుపులో పిండం వల్ల నాకు గండం ఉంది అంటే నేను బ్లాక్ మాన్ నుంచి తప్పించుకుంటాననే కదా అర్థం అంటుంది మనోహరి. అది పూర్తిగా కాదు మనోహరి నువ్వు ఆ బ్లాక్ మాన్ నుంచి తప్పించుకున్నా ఆ పిండం నిన్ను వెంటాడుతుంది అని చెప్తుంది చంభా.. అందుకే ముందు ఆ పిండానికి పిండం పెడదాం నన్ను చంపడానికి వచ్చిన బ్లాక్ మ్యాన్ మిస్ ఫైర్ అయి భాగీని చంపినట్టు క్రియేట్ చేద్దాం అంటుంది మనోహరి. బ్లాక్ మ్యానా.. భాగీని ఎందుకు చంపుతాడు. అతడి టార్గెట్ నువ్వు కదా..? అని అడుగుతుంది చంభా.. నిజమే.. నిజమైనా బ్లాక్ మ్యాన్ టార్గెట్ నేనే కానీ మనం క్రియేట్ చేసిన బ్లాక్ మ్యాన్ టార్గెట్ ఆ భాగీ అని మనోహరి చెప్పగానే.. మనం క్రియేట్ చేసే బ్లాక్ మ్యానా..? అని చంభా అడుగుతుంది.
అవును మనమే ఒక బ్లాక్ మ్యాన్ ను క్రియేట్ చేసి భాగీని చంపేద్దాం అని మనోహరి చెప్పగానే.. మనం ఎవర్ని బ్లాక్ మ్యాన్ గా క్రియేట్ చేయాలి.. అని చంభా అడగ్గానే.. మనం బ్లాక్ మ్యాన్ గా క్రియేట్ చేసేది రణవీర్‌ను.. తనను బ్లాక్ మ్యాన్‌గా క్రియేట్ చేసి భాగీని చంపిద్దాం అంటుంది మనోహరి. రణవీరా..? రణవీర్ ఎందుకు చేస్తాడు.. అని చంభా అడగ్గానే.. తను ఎందుకు చేయడు అంటూ డోర్ వైపు చూస్తుంది మనోహరి. అక్కడ మిస్సమ్మ ఉండటం చూసి షాక్ అవుతుంది. చంభా కూడా భయపడుతుంది. మిస్సమ్మ లోపలికి వెళ్లి చంభాను కోపంగా చూస్తూ.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు యాదమ్మ అని అడగ్గానే.. చంభా అది మేడం.. అది.. నేను.. అంటూ ఏం చెప్పాలో అర్థం కాక కన్పీజ్ అవుతుంటే.. మనోహరి కల్పించుకుని యాదమ్మను నేనే పిలిచాను భాగీ అంటుంది.
ఏ ఎందుకు ఎవరి పనుల వాళ్లే చేసుకోవాలని యాదమ్మ నా పనులు మాత్రమే చేయాలిన ఆయన చెప్పి వెళ్లారు కదా అంటుంది మిస్సమ్మ.. అదే ఆ మాటే యాదమ్మకు చెప్పడానికి పిలిచాను.. అని మనోహరి చెప్పగానే.. ఆయన చెప్పారు కదా మళ్లీ నువ్వు పని కట్టుకుని చెప్పాలా..? అని మిస్సమ్మ అడగ్గానే.. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ ఏంటి భాగీ అని మనోహరి అడుగుతుంది. దీంతో మిస్సమ్మ కోపంగా యాదమ్మ ఎప్పుడూ నీ పక్కనే ఉంటుంది అదే ప్రాబ్లం.. అంటుంది మిస్సమ్మ.. అయ్యో అదేం లేదమ్మా నేను మీ పనులు చేయడానికే వచ్చాను. ఇంకోసారి నేను ఈ మేడం దగ్గరకు రాను.. నేను వెళ్లి వంట చేస్తానమ్మా అనగానే.. మిస్సమ్మ కోపంగా సరే వెళ్లు అని చెప్తుంది. దీంతో యాదమ్మ అలియాస్ చంభా వెళ్లిపోతుంది. చూడు నువ్వు యాదమ్మను మళ్లీ పిలిస్తే బాగోదు చెప్తున్నా..? ఇంకోసారి ఇలా చేశావంటే ఆయనతో చెప్పాల్సి వస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే.. దీంతో మనోహరి బాగీ నేను టెన్షన్‌లో ఉన్నాను. హెడేక్ టాబ్లెట్ తెమ్మని యాదమ్మను పిలిచాను అది కూడా తప్పేనా.? అని ప్రశ్నిస్తుంది. దీంతో యాదమ్మ లేకపోతే ఏం చేసేదానివి నువ్వు తెప్పించుకునే దానివి కదా..? గుర్తు పెట్టుకో నా కోసం ఆయన యాదమ్మను రిక్రూట్ చేశారు.. నీ కోసం కాదు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది మిస్సమ్మ..
మిస్సమ్మ వెళ్లిపోయాక మనోహరి, రణవీర్‌కు కాల్ చేసి బ్లాక్ మ్యాన్ లాగ అమర్ ఇంటికి రమ్మని చెప్తుంది. ఎలాగైనా భాగీని నేను బయటకి లాన్ లోకి తీసుకొస్తాను.. అప్పుడు భాగీని కాల్చి చంపేయ్ అని చెప్తుంది. ఆ బ్లాక్ మ్యానే నన్ను చంపడానికి వచ్చి మిస్ ఫైర్ అయి భాగీ చనిపోయిందని క్రియేట్ చేద్దాం అని చెప్తుంది. దీంతో రణవీర్ సరే అంటాడు. మరోవైపు బ్లాక్ మ్యాన్ గురించి ఆలోచిస్తుంటాడు అమర్. ఇంతలో నిజమైన బ్లాక్ మ్యాన్ అమర్ ఇంటికి వచ్చి గేటు దగ్గర నిలబడి చూస్తూంటే.. పై నుంచి చూసిన చంభా రణవీరే వచ్చాడనుకుని మనోహరి రణవీర్ బ్లాక్ మ్యాన్ వేషంలో వచ్చాడు అని చెప్తుంది. దీంతో మనోహరి సంతోషంగా నేను వెళ్లి లాన్‌లో కూర్చుంటాను.. నువ్వు ఏదో రకంగా భాగీని లాక్ లోకి పంపించు అని చెప్పి మనోహరి వెళ్లి లాన్ లో కూర్చుని బుక్ చదువుతుంది. ఇంతలో బ్లాక్ మ్యాన్ గోడ దూకి అమర్ ఇంట్లోకి వస్తాడు. మిస్సమ్మ బయటకు వస్తుంటే.. బ్లాక్ మ్యాన్ మనోహరిని కాల్చేస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.