OTT Movie : కొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంటాయి. అలాంటి సినిమాలలో ‘మంజుమల్ బాయ్స్’ కూడా ఒకటి. కేవలం 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో, 240 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అబ్బుర పరిచింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ కథ 2006లో తమిళనాడులోని కొడైకెనాల్‌కు సెలవులకు వెళ్లే 11 మంది స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఒక వ్యక్తి గుహలో ఇరుక్కుపోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ చిత్రానికి అనేక అవార్డులు కూడా వచ్చాయి. అయితే అదే విధంగా వివాదాలను కూడా మూటగట్టుకుంది. ఈ సినిమా ప్రధాన నటుడు జైలుకు వెళ్లడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివారాలు తెలుసుకుందాం పదండి.
‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel boys) సినిమాకు సంబంధించిన వివాదంలో సిరాజ్ వళక్కడప్పురం అనే వ్యక్తి నిర్మాతలపై ఆరోపణలు చేశాడు. అతను ఈ సినిమా నిర్మాతలైన సౌబిన్ షాహిర్, అతని తండ్రి షాహిర్ షాన్, ఆంటోనీలపై చీటింగ్ కేసు పెట్టాడు. సిరాజ్ ఈ సినిమా నిర్మాణంలో రూ. 7 కోట్లు పెట్టుబడి పెట్టానని ఆరోపించారు. ఆ తరువాత సినిమా భారీ విజయం సాధించి, లాభాలు వచ్చినా, తనకు రావాల్సిన వాటా (సుమారు 40 శాతం) ఇవ్వకుండా నిర్మాతలు మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు ఆధారంగా, కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, నిర్మాతలు సౌబిన్ షాహిర్ ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ వివాదంలో సౌబిన్ షాహిర్ జైలుకు వెళ్ళి, ఆ తరువాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇప్పటికీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది.
Read Also : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్
“మంజుమల్ బాయ్స్” 2024 ఫిబ్రవరి 22 విడుదలైన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు. ఈ సినిమా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకుడు విభాగాలతో సహా 10 అవార్డులను గెలుచుకుంది. జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 2 గంటల 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి, ఐయండిబిలో 8.2 రేటింగ్ ఉంది. ఈ సినిమా 243 కోట్లు వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టింది.