BigTV English

September Horoscope 2024: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతారు

September Horoscope 2024: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతారు

September Horoscope 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయి. సెప్టెంబర్ నెలలో గ్రహాల నక్షత్ర మార్పు పలు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్‌లో బుధుడు, సూర్యుడు, శుక్రుడు తమ తమ రాశులను మార్చుకోనున్నారు. సెప్టెంబర్ నెలలో రెండుసార్లు బుధుడి రాశి మార్పు జరగనుంది. తిరోగమన దశలో బుధుడు సెప్టెంబర్ 4న సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. తర్వాత సెప్టెంబరు 23న కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. కన్యరాశి మార్పు తర్వాత సూర్యుడు కూడా సెప్టెంబరు 16 నుంచి కన్యారాశిలో సంచరించనున్నాడు. శుక్రుడు సెప్టెంబరు 18 నుంచి సొంత రాశి అయిన తులారాశిలో తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. దీని వల్ల కన్య రాశిలో సూర్య, బుధ గ్రహాల సంయోగం జరగనుంది.


గ్రహాల సంచారం మొత్తం 12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కొన్ని రాశుల వారు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా సెప్టెంబర్ లో గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:
సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ నక్షత్ర గ్రహాల కదలిక మీకు శుభవార్తలను తెచ్చిపెడుతుంది. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. ఆదాయం పెరగడం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి సమయం. అంతే కాకుండా మీ సౌకర్యాలు కూడా భారీగా పెరుగుతాయి.


సింహ రాశి:
సింహ రాశి వారికి సెప్టెంబర్‌లో శుభాలు కలుగుతాయి. డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఏది అవసరమో కూడా అదే మీకు ఈ నెలలో అందుబాటులో ఉంటుంది. వ్యాపార విస్తరణలో లాభాలను చూస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కోర్టు కేసుల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి:
సెప్టెంబర్ నెలలో కన్య రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. ఈ కాలంలో మీరు అధిక లాభాలను పొందుతారు. డబ్బులు కూడబెట్టుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో కూడా మీరు బాగా రాణిస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని శుభవార్తలను కూడా అందుకునే అవకాశం ఉంది.

తులా రాశి:
తులారాశి వారికి సెప్టెంబర్ నెల శుభప్రదంగా ఉంటుంది. ఇది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలపై పని చేయడానికి ఇది మంచి సమయం. పెట్టుబడిపై మంచి రాబడిని కూడా పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి కూడా పెరుగుతుంది. ఈ నెలలో విజయాలను పొందుతారు.

ధనస్సు రాశి:
సెప్టెంబర్ నెలలో ధనస్సు రాశివారు శుభవార్తలు అందుకుంటారు. పెండింగులో ఉన్న పనులను కూడా పూర్తిచేస్తారు. మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు బాగా డబ్బు సంపాదిస్తారు. ఆఫీసులో సీనియర్లు మీరు చేసే పనిపై ఆకర్షితులవుతారు. మీరు వ్యాపారాల్లో కూడా లాభపడతారు.

Also Read: సెప్టెంబరులో శని అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి లాభాలే లాభాలు..

మీన రాశి:
సెప్టెంబర్ నెల మీన రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. కొత్త పనులు కూడా ప్రారంభం చేస్తారు. మీరు ఉద్యోగంలో మంచి మార్పులు చేస్తారు. ఆర్థికంగా మంచి పనితీరును కనబరుస్తారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×