BigTV English

Shivratri Puja : శివరాత్రి పూజలో ఈ పువ్వులు వాడారా…

Shivratri Puja : శివరాత్రి పూజలో ఈ పువ్వులు వాడారా…

Shivratri Puja : పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడా ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.


శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.

శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పచ్చగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×