BigTV English

Pakistan: పాకిస్తాన్ లో ముంబై తరహా ఉగ్రదాడి.. చేసిన పాపం అనుభవించాల్సిందేనా!?

Pakistan: పాకిస్తాన్ లో ముంబై తరహా ఉగ్రదాడి.. చేసిన పాపం అనుభవించాల్సిందేనా!?

Pakistan: చేసిన పాపం ఊరికే పోదంటారు. ఉగ్రవాదులకు పాలు పోసి పెంచారు. ట్రైనింగ్ ఇచ్చి, ఆయుధాలు సమకూర్చి.. ముంబైపై దాడికి ఉసిగొల్పారు. ముష్కర మూక ముంబై మహానగరంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి.. వందలాది మందిని పొట్టనపెట్టుకుంది. కసబ్ ను దొరకబట్టి.. ఉరి తీసి కసి తీర్చుకుంది ఇండియా.


ముంబైలో మారణహోమం జరిపించించి పాకిస్తానే అని అందరికీ తెలుసు. అందుకు సాక్షాలు కూడా ఉన్నాయి. అయినా, తమకేం సంబంధం లేదని బుకాయిస్తుంటుంది పాపిస్తాన్. అయితే, ఏ ఉగ్రవాదులకైతే పాక్ పాలు పోసి పెంచిందో.. ఇప్పుడు అదే టెర్రరిస్టుల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుస బాంబు పేలుళ్లతో వందలాది మంది చనిపోతున్నారు. లేటెస్ట్ గా, కరాచీలో ముంబై తరహా దాడికి తెగబడ్డారు ఉగ్రవాదులు.

10 మంది ఉగ్రవాదులు కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జొరబడ్డారు. ధనాధన్ కాల్పులు జరిపారు. పోలీసులు కోలుకునేలోగా తూటాలు దిగిపోయాయి. టెర్రర్ అటాక్ లో 12 మంది కరాచీ పోలీసులు చనిపోయారని తెలుస్తోంది. హెడ్ క్వార్టర్స్ లోపల ఫైరింగ్ ఇంకా కొనసాగుతోందని సమాచారం.


కరాచీ పోలీస్ చీఫ్ ను ఉగ్రవాదులు బంధీగా పట్టుకున్నారని అంటున్నారు. విషయం తెలిసి.. అదనపు బలగాలను తరలించారు. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరా కాల్పులు జరుగుతున్నాయి.

సేమ్ టు సేమ్ ముంబై అటాక్ మాదిరే జరిగిందీ ఘటన. ఇండియాకు ఆర్థిక రాజధాని అయిన ముంబైలో జరిగినట్టుగానే.. పాకిస్తాన్ ఫైనాన్సియల్ కేపిటల్ కరాచీలో టెర్రర్ అటాక్ జరగడం యాదృచ్ఛికం.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×