BigTV English

Pregnant : భార్య కడుపుతో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోకూడదా…?

Pregnant : భార్య కడుపుతో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోకూడదా…?

Pregnant : కట్టుకున్న భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు మారవద్దని, కొత్త ఇల్లు కట్టుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. కొంతమంది పెద్దల సలహా ఏంటంటే ఇల్లు మారడం లాంటిది చేయవచ్చు కానీ.. కొత్త గృహం నిర్మాణం వద్దని సూచిస్తున్నారు. జీవితాంతం ఉండే ఇల్లు, వంశాన్ని ఉద్దరించే సంతానం పట్ల ఆలుమగలకు ఎంతో శ్రద్ధ అవసరం. గర్భవతిగా ఉన్న భార్యను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇల్లుకట్టడం కూడా చాలా పెద్ద విషయమే. ఈ రెండింటిని ఏకకాలంలో చూడటం కష్టమైన విషయం. అందుకే రెండింటికి న్యాయం చేయలేరు.కాబట్టి గృహ నిర్మాణం వద్దని చెబుతుంటారు.


పైగా గర్భవతులపై వాస్తుప్రభావం ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గృహం కట్టేటప్పుడు నిర్మాణ సమయంలో పదము, ఆయము అనేవి లెక్క గట్టి గర్భము అనేది నిర్ణయిస్తుంటారు. గృహ నిర్మాణం చేసేటప్పుడు ఇంట్లో గర్భం దాల్చిన స్త్రీలు ఉంటే ఆ ఇంటి యజమాని మరో గర్భాన్ని నియమించకూడదని శాస్త్రం చెబుతోంది. ఒక గర్భం ధరించిన స్త్రీ తన చేతితో పండను అంటే గర్భాన్ని మరొకరికి ఇవ్వకూడదు. పండులో కూడా గర్బం ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్న మహిళలు గర్భంతో ఉన్నప్పుడు నూతన గృహాన్ని నిర్మించకూడదు.

అలాగే గర్భం దాటిన స్త్రీ ఇంట్లో ఉండగా ఆ ఇంట్లో ఎలాంటి వాస్తు మార్పులు చేయకూడదు. ముఖ్యంగా ఐదో నెల నిండిన తర్వాత ఎలాంటి మార్పుల జోలికి వెళ్లకూడదు. ద్వారాలు మార్చడం, ప్రహారీ గోడ ఎలైన్ మెంట్లు కూడా చేయకూడదు. అలా కాదని చేసే దాని వల్ల కలిగే ఫలితాలు మొదటి ప్రభావం పడేది ఆ ఇంట్లో మహిళలపైనే. ఆ తర్వాత యజమానిపై పడుతుంది. చివరకి పిల్లలపై ఉంటుంది. ఇళ్లల్లో వాస్తుమార్పులు చేసే ముందు ఇంట్లో మహిళలు గర్భవతులుగా ఉన్నారేమో తెలుసుకుని పని ప్రారంభించాలి. గర్భవతులుగా ఉంటే మాత్రం పని మొదలపెట్టడం మంచిది కాదు.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×